Banana : మనం ఆరోగ్యం కోసం రోజు ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం. వాటిలలో ఒకటి అరటిపండు. అయితే అరటి పండులో గ్లూకోజ్ స్థాయిలు అనేవి అధికంగా ఉంటాయి.దీని నుండి మన శరీరానికి వెంటనే శక్తి అనేది లభిస్తుంది. అయితే ఈ అరటి పండ్లను జీర్ణక్రియను బలోపేతం చేసేందుకు ఉత్తమమైన పండుగ చెబుతూ ఉంటారు. అలాగే కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. అలాగే అరటి పండులో ఫైబర్ మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు యొక్క అనారోగ్యాన్ని కూడా తగ్గిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోజుకు ఒక అరటి పండును తీసుకుంటే మీ ప్రేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. మీకు గనక గ్యాస్ మరియు అజీర్ణ సమస్యలు కనుక ఉంటే అరటి పండు తీసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే అసిడిటీ కారణం చేత ఛాతిలో వచ్చే మంటను కూడా తగ్గిస్తుంది. మీకు గనక అధిక రక్తపోటు ఉంటే రోజు ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే అరటి పండులో పొటాషియం ఎక్కువగా మరియు సోడియం చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ కారణం చేత అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది…
మన శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వలన తొందరగా అలిసిపోతూ ఉంటాము. కావున మీరు తక్కువ శక్తిని అనుభవిస్తారు. ఇటువంటి పరిస్థితులలో మీరు రోజు ఒక అరటిపండును తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకు అంటే అరటి పండులో కార్బోహైడ్రే ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మీ శరీరానికి వెంటనే శక్తిని అందించడానికి చక్కగా పని చేస్తాయి. అలాగే దీనిలో విటమిన్ బి కూడా ఉంటుంది. అయితే అరటి పండ్లను తినడం వలన గుండె ఆరోగ్యం కూడా ఎంతో బాగా మెరుగుపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఖనిజంగా చెబుతూ ఉంటారు. మీరు గనక ఒక నెల రోజుల పాటు రోజు అరటి పండును తీసుకుంటే మీ గుండె ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుంది. అలాగే అరటిపండు ను తీసుకోవడం వలన మీ మనసుతో పాటుగా శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే అరటి పండులో ఉండే విటమిన్ సి మీ మెదడు ఆరోగ్యాని కి తోడ్పడి సెరోటోనిన్ ను రిలీజ్ చేస్తుంది.
అరటి పండులో మాంగనీస్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి చర్మ కణాలను దెబ్బ తినకుండా రక్షిస్తుంది. దీనిలో ఉన్నటువంటి విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అరటి పండ్లు విటమిన్ b6 కూడా ఉంటుంది. మీరు రోజు మీడియం సైజు ఒక అరటి పండును కనుక తీసుకుంటే అది మీ శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ b6 ను ఇస్తుంది. ఈ విటమిన్ b6 అనేది ఎక్కువగా రక్త కణాలను తయారు చేస్తుంది. అలాగే ఇది కాలేయం మరియు మూత్రపిండాల నుండి ఎంతో అవసరమైన రసాయనాలను కూడా తొలగిస్తుంది. అలాగే నాడీ వ్యవస్థను ఎంతో ఆరోగ్యంగా ఉంచటం లో కూడా హెల్ప్ చేస్తుంది. అరటి పండును సాధారణంగా అల్పాహారంలో తీసుకుంటే మంచిది. అప్పుడు ఇది వెంటనే శక్తిని ఇస్తుంది. అలాగే రాత్రిపూట దీనిని తినడం వీలైనంత వరకు మానుకుంటే మంచిది…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.