Tulasi Plant : హిందూమతంలో తులసి చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తులసి చెట్టుని సకల దేవతల స్వరూపంగా కొలుస్తూ పూజలను నిర్వహిస్తారు. అయితే ఇంట్లో తులసి చెట్టు ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఉంటుందని వేద పండితులు చెబుతారు. తులసి చెట్టుని ఇంట్లో గాలి ,వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచడం శ్రేయస్కరం. అలాగే తులసి చెట్టు దగ్గర గణపతి విగ్రహాన్ని ఉంచకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. దీనికి ఒక కధ కూడా ఉందంట మరి అది ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
– పురాణాల ప్రకారం ఒకరోజు వినాయకుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా అదే సమయంలో తులసీ దేవి నదిలో నుండి వస్తుంది. అయితే తులసీదేవి వినాయకుడి అందానికి మెచ్చి తనని వివాహం చేసుకోమని కోరింది. దానికి వినాయకుడు నిరాకరించాడు. దీంతో తులసి ఆగ్రహిస్తూ నీవు రెండు వివాహాలు చేసుకుంటావని శపించింది. అందుకే తులసి చెట్టు వద్ద వినాయకుడి ప్రతిభను పెట్టకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి.
-అదేవిధంగా కార్తీక మాసంలో భక్తులు తులసి చెట్టు దగ్గర శివలింగాన్ని పెట్టి పూజలను చేస్తారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దీనికి కారణం మహావిష్ణువుకి తులసి ప్రీతికరమైనది. అయితే గత జన్మలో జలంధరుడు అనే రాక్షసుడి భార్య తులసి. అప్పుడు ఆమె పేరు బృంద. జలంద్రుడు పరమశివుడిని సంహరించడం వలన పరమశివుడిని తులసి తో పూజించకూడదని పండితులు చెబుతున్నారు.
– అంతేకాకుండా తులసి చెట్టు దగ్గర చెత్త మరియు చీపుర్లను ఉంచకూడదు. తులసి చెట్టు పవిత్రమైనది కాబట్టి ఇల్లు శుభ్రం చేసే చీపురులను అక్కడ పెడితే కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో అశుభం జరుగుతుందని పెద్దలు అంటారు. ఒకవేళ తులసి చెట్టు చుట్టూ చెత్త ఉంటే ఇంట్లో అనారోగ్య సమస్యలు మరియు ఆర్థికంగా నష్టపోతారు. తులసి చెట్టులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.
– ఇకపోతే తులసి చెట్టుకి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలను చేస్తారు. అలాంటి పవిత్రమైన తులసి చెట్టు దగ్గర చెప్పులు ఉంచితే ఇంట్లో ఆనందం కరువు అవుతుంది. కనుక తులసి చెట్టు ఉన్న దగ్గర చెప్పులు మరియు చెప్పులను అస్సలు ఉంచకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినవారవుతారు. దీని ఫలితంగా ఇంట్లో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తులసి చెట్టు వద్ద ముళ్ళ చెట్లను నాటకూడదు. అవి ఉంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ త్వరగా వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.