Health Benefits : గంజి తాగడం మంచిదా..కాదా.. ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : గంజి తాగడం మంచిదా..కాదా.. ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే…!!

Health Benefits : గంజి అంటే మనం వండుకునే అన్నం నుంచి తీసే దాన్నే గంజి అంటారు. అయితే పాతకాలం వాళ్ళు నిత్యం ఈ గంజిని తాగేవాళ్లు. వాళ్లుకు ఈ గంజి ఎంతో శక్తిని అందిస్తుందని నమ్ముతూ ఉండేవాళ్లు.. అయితే ఈ గంజి ని పాతకాలం వాళ్ళు ఆహార పదార్థాల్లో ముఖ్యమైన ఆహారంగా తినేవాళ్లు. అయితే దీంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఈ గంజిని తాగినప్పుడు కడుపు నిండిన భావనతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 February 2023,8:20 am

Health Benefits : గంజి అంటే మనం వండుకునే అన్నం నుంచి తీసే దాన్నే గంజి అంటారు. అయితే పాతకాలం వాళ్ళు నిత్యం ఈ గంజిని తాగేవాళ్లు. వాళ్లుకు ఈ గంజి ఎంతో శక్తిని అందిస్తుందని నమ్ముతూ ఉండేవాళ్లు.. అయితే ఈ గంజి ని పాతకాలం వాళ్ళు ఆహార పదార్థాల్లో ముఖ్యమైన ఆహారంగా తినేవాళ్లు. అయితే దీంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్యనిపుణులు చెప్తున్నారు. ఈ గంజిని తాగినప్పుడు కడుపు నిండిన భావనతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. ఈ గంజిలో ఎన్నో ఆరోగ్యమైన న్యూట్రియన్స్ ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి మేలు చేసే ఆ మైనో ఆమ్లాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో స్టార్చ్ పోషకలతో పాటు విటమిన్ బి, విటమిన్ సి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం చాలా మంచిది..  గంజిని నీటిని తాగడం వలన జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి.

Amazing Health Benefits of Rice Porridge

Amazing Health Benefits of Rice Porridge

అలాగే ఫుడ్ పాయిజన్ అజీర్ణం లాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ గంజిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే ఈ గంజిని తాగితే కడుపులో ఆసరాగా అనిపిస్తుంది. దీనిలో విటమిన్స్ వెంటేనే శక్తిని ఇస్తాయి మన ప్రేగు కదిలికలను మెరుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడుతుంది. హైడ్రేషన్ :నీరు తాగడం ప్రతిసారి ఇబ్బందిగా అనిపిస్తే దాని బదులు గంజి కూడా తీసుకోవచ్చు. దీని తాగడం వల్ల డిహైడ్రేషన్ తగ్గిపోతుంది. శక్తినిచ్చే డ్రింక్ లో ఈ గంజి కూడా ఒకటి. జ్వరం, ఇన్ఫెక్షన్లు, వాంతులు సమస్యలతో బాధపడేవారు ఈ గంజిని తీసుకోవడం వలన కాస్త ఉపశమనం గా అనిపిస్తూ ఉంటుంది. తాగే ముందు; గంజి తాగే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే పూర్వకాలంలో బియ్యాన్ని పండించేటప్పుడు ఎటువంటి మందులు రసాయనక విలువలు లేకుండా పండించేవారు.

Amazing Health Benefits of Rice Porridge

Amazing Health Benefits of Rice Porridge

దాంతో బియ్యం బాగుండేవి. ఆ బియ్యంతో గంజి తాగే వాళ్ళు కానీ నేడు అలా కాదు పరిస్థితి కెమికల్ లేని పంటలు పండించడం చాలా కష్టమైంది. కావున కొంతమందికి ఈ సూపర్ డ్రింకు ఆరోగ్యమీస్తే ఇంకొందరికి నష్టాలు తీసుకొస్తుంది. అది వారి శరీరత్వాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి గంజి తాగే ముందు మీ పరిస్థితిని డాక్టర్ కి చెప్పి తర్వాత ఈ గంజిని తాగడం మొదలు పెట్టండి..తక్షణ శక్తి కోసం : బియ్యం నీటిలో కార్బోహైడ్రేస్ పుష్కలంగా ఉంటాయి. వాటిలో కొన్ని గంజిలోనూ అందుతాయి. వీటి నీటిని తాగడం వలన శక్తి లెవెల్స్ తిరిగి మానసిక స్థితి మెరుగ్గా మారుస్తుతుంది. ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో ఉపవాసం ఉన్నవాళ్లు తర్వాత రోజు ఉదయం గంజినీటిని తీసుకుంటూ ఉంటారు. దీంతో తక్షణమే శక్తి అందుతుంది.. అయితే ఇది తాగే ముందు కచ్చితంగా వైద్య ని మీ కండిషన్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత తాగడం మొదలు పెట్టండి…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది