Honey : ముఖానికి తేనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా… ఈ ముఖ్య విషయాలు మీకోసమే…??
ప్రధానాంశాలు:
Honey : ముఖానికి తేనె రాసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా... ఈ ముఖ్య విషయాలు మీకోసమే...??
Honey : తేనె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తేనె గురించి చిన్న పిల్లలకు కూడా బాగా తెలుసు. ఈ తేనెలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ తేనెను ఆయుర్వేదంలో కూడా ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి వాడతారు. ఈ తేనెలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ తేనె తో కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ తేనెతో చర్మం మరియు జుట్టు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ తేనె ను రోజు తీసుకోవటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. అలాగే తేనె గాయాలను కూడా తొందరగా మానేలా చేస్తుంది. అలాగే జీర్ణ క్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ తేనె లో ఉండే లాభాలు అన్ని ఇన్ని కావు. అలాగే ఈ తేనెతో చర్మ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. కానీ ఈ తేనెను ముఖంపై నేరుగా రాసుకోవద్దు అని అంటుంటారు. కానీ దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. కేవలం అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రమే బ్యాచ్ టెస్ట్ చేసుకుని వాడాలి. మరి ముఖానికి తేనెను రాసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మొటిమలు పోతాయి : మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారు తేనెను ముఖానికి రాసుకోవడం వలన ఈ సమస్య నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఎందుకు అంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మం పై ఉన్నటువంటి బ్యాక్టీరియాను మరియు మచ్చలను తగ్గిస్తుంది. కావున మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ముఖానికి తేనెను రాసుకోవచ్చు.
Honey ఎక్స్ పొలియేట్ చేస్తుంది
ఈ తేనే అనేది చర్మాన్ని ఎక్స్ పోలియేట్ చేస్తుంది. అనగా చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది అన్నమాట. ఈ తేనె లో ఉండే కొన్ని రకాల ఎంజెమ్స్ అనేవి నాచురల్ ఎక్స్ పోలియేటెడ్ గా పనిచేస్తాయి. అలాగే డ్రై స్కిన్ తో ఇబ్బంది పడే వారు కూడా తేనెను రాసుకుంటే చర్మం సాఫ్ట్ గా మరియు హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
యవ్వనంగా ఉంటారు : ముఖానికి తేనె రాసుకోవడం వలన మీరు ఎప్పుడు యవ్వనంగా మెరుస్తూ ఉంటారు. ఎందుకు అంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా ఎంతగానో పెంచుతాయి. కావున చర్మంపై ఎలాంటి డామేజ్ కాకుండా ఉంటుంది. అంతేకాక వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది…
క్లియర్ గా స్కిన్ : తేనెను చర్మానికి రాసుకోవడం వలన చర్మం ఎంతో అందంగా కనిపిస్తుంది. అలాగే మచ్చలు మరియు మొటిమలు, గీతలు, ముడతలు లేకుండా చర్మం అనేది ఎంతో క్లియర్ గా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాక ఫ్రీగ్నెంటేషన్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. దీంతో మీరు యవ్వనంగా ఉంటారు.