Non Veg : ప్రస్తుత కాలంలో ఆదివారం వచ్చింది అంటే చాలు కచ్చితంగా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందే. అలాగే పండగ వచ్చినా, బంధువులు వచ్చినా ఈ నాన్ వెజ్ ను వండటం సాధారణంగా మారింది. మనలో ఎంతోమంది నాన్ వెజ్ ప్రియులు ఉన్నారు. అలాంటి వాళ్ల అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. అయితే కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు అనే తేడా లేకుండా ఇలా అన్నిటి పంపకంలో కూడా యాంటీ బయాటిక్ వాడటం అధికంగా పెరిగింది. దీని వలన వాటిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్సి ఎక్కువైంది. ఈ విషయాలు అన్నీ కూడా అధికారుల పరిశోధనలు బయటపడ్డాయి. ఈ విషయాలన్నీ వెలుగులోకి రావడంతో మాంసాహారుల్లో ఆందోళన స్టార్ట్ అయింది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలలో 2019 నుండి 2022 మధ్యకాలంలో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ లో పరీక్షించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాక పలు రకాల బ్యాక్టీరియా ఆనవాళ్ల పై కూడా పరిశోధనలు చేశారు. వీటిలో బర్రెలు మరియు ఆవులు తప్ప మిగిలిన అన్ని జంతువులలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే ఈ పరిశోధనలో తేలిన విషయంతో ప్రస్తుతం ఏమి తినాలి అన్న మాంసాహారులు భయపడుతున్నారు. అయితే మనోళ్లకు వారానికి ఒక్కసారైనా ముక్క మొట్టందే ముద్ద దిగదు. కానీ ఈ నాన్ వెజ్ లో యాంటీ బయాటిక్స్ చేరటంతో మనుషుల ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే ఇలా ఒక్కసారిగా మాంసాహారం తినే అలవాటును ఎవరు కూడా మార్చుకోలేరు. అలాగని వాటిని తిని రోగాల బారిన పడే ధైర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా నాన్ వెజ్ ప్రియులు దేనిని ఎంచుకుంటారో చూడాలి. ప్రస్తుత కాలంలో కోళ్ల పెంపకం అనేది ఫాస్ట్ గా జరిగెందుకు వాటికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని నిపుణులు తెలిపారు. అయితే ఈ స్టెరాయిడ్స్ ఇచ్చినటువంటి కోళ్లను తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది అని వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజన్ లాంటివి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అంటున్నారు.
అయితే మీరు రోగాల బారిన పడకుండా ఉండాలి అంటే, ఫారం లో పెంచే కోళ్లను కాకుండా ఇంట్లో పెంచుకునే కోళ్లను మాత్రమే తినాలి అని సూచిస్తున్నారు. ఈ స్టెరాయిడ్స్ లాంటివి లేని మాంసం తీసుకోవడం వలన ఆరోగ్య రక్షించుకోవచ్చు అని వైద్యులు అంటున్నారు. అయితే మాంసం విక్రెతలు నిబంధనలను పాటించేలా ర్యాండమ్ గా చెక్ చేస్తూ ఉంటాం అని ఒకవేళ ఎవరైనా వ్యక్తులు ఈ రూల్స్ ను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ అధికారి తెలిపారు. అయితే అమ్మటానికి పనికిరాని మరియు కుళ్ళిన మాంసాన్ని అమ్మినట్లయితే వాటికి సంబంధించిన దుకాణాలను మూసివేస్తామని కూడా తెలిపారు. అయితే వ్యాపారుల లాభపేక్ష వలన మార్కెట్లో దొరికే మాంసం విషం గా మారి అది తిన్నటువంటి వారి ప్రాణాలకు ముప్పు అనేది ఏర్పడుతుంది. అయితే జంతువుల క్వాంటిటీ కోసం క్వాలిటీ ని పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇలాంటి వారిని అధికారులు ఉపేక్షించ రాదు అని మాంసాహార ప్రియులు కోరుతున్నారు…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.