Rains : ఆ జిల్లాల వారు జాగ్రత్త.. రానున్న 24 గంటలలో కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణలోని పలు జిల్లాలు రానున్న 24 గంటలపాటు ఇదే తరహాలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
వాయుగుండం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. నారాయణపేట, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచిస్తుంది.
Rains : ఆ జిల్లాల వారు జాగ్రత్త.. రానున్న 24 గంటలలో కుండపోత వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురవనుండగా.. ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణంగా తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆదివారం, సోమవారం కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.తెలంగాణ డెవలప్‌మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. రాష్ట్రంలో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లిలోని సర్వాయిపేట, మంచిర్యాల జిల్లాలోని కొండాపూర్‌లో వరుసగా 75.2, 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
This website uses cookies.