Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..!
Migraine : ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించట్లేదు. అంతే కాకుండా సరైన లైఫ్ స్టైల్ లేకపోవడంతో పాటు వ్యాయామాలు చేయకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో మైగ్రేన్ నొప్పి కూడా ఉంది. ఇది నాడీ సంబంధిత సమస్య. ఇది ఒక గంట నుంచి మొదలు పెడితే.. 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇందులో రోగి తలనొప్పితో పాటు కడుపు సమస్యలు, వికారం, వాంతులు మొదలైన వాటితో బాధపడవచ్చు. అయితే మైగ్రేన్ తో బాధపడుతుంటే.. వేసవిలో వీటిని అస్సలు తినొద్దు. అవేంటో తెలుసుకుందాం.
చాలామంది కాఫీ లేకుండా రోజు గడపలేరు. అయితే కాఫీ తాగితే మైగ్రేన్ నొప్పి ఆల్రెడీ ఉన్న వారికి అది ఇంకా ఎక్కువ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు తలనొప్పి తగ్గుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడు నరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.
ఈ రోజుల్లో చాక్లెట్ అనేది చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారిదాకా అందరూ తింటుంటారు. అయితే చాక్లెట్ లో ఉండే కెఫిన్, బీటా ఫెనిలేథైలమైన్ లాంటివి రక్తనాళాల్లో ఉద్రిక్తతను పెంచుతాయి. దాని వల్ల మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి చాక్లెట్లను తినకపోవడమే బెటర్.
ఎండాకాలంలో చల్లగా ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేరు. చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువనే అవుతుంది. వ్యాయామం చేసిన వెంటనే లేదంటే ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే మాత్రం మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.
Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..!
సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే. నారింజ, కివి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తీసుకుంటే ఎండాకాలంలో చల్లదనం ఉంటుందని అంతా అనుకుంటారు. అయితే వీటిని తింటే మైగ్రేన్ నొప్పి అధికం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది నొప్పిని తీవ్రతరం చేస్తుంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.