Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..!

Migraine : ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించట్లేదు. అంతే కాకుండా సరైన లైఫ్ స్టైల్ లేకపోవడంతో పాటు వ్యాయామాలు చేయకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో మైగ్రేన్ నొప్పి కూడా ఉంది. ఇది నాడీ సంబంధిత సమస్య. ఇది ఒక గంట నుంచి మొదలు పెడితే.. 2 నుంచి 3 రోజుల వరకు కూడా […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..!

Migraine : ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ లో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించట్లేదు. అంతే కాకుండా సరైన లైఫ్ స్టైల్ లేకపోవడంతో పాటు వ్యాయామాలు చేయకపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో మైగ్రేన్ నొప్పి కూడా ఉంది. ఇది నాడీ సంబంధిత సమస్య. ఇది ఒక గంట నుంచి మొదలు పెడితే.. 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇందులో రోగి తలనొప్పితో పాటు కడుపు సమస్యలు, వికారం, వాంతులు మొదలైన వాటితో బాధపడవచ్చు. అయితే మైగ్రేన్ తో బాధపడుతుంటే.. వేసవిలో వీటిని అస్సలు తినొద్దు. అవేంటో తెలుసుకుందాం.

Migraine : కాఫీ

చాలామంది కాఫీ లేకుండా రోజు గడపలేరు. అయితే కాఫీ తాగితే మైగ్రేన్ నొప్పి ఆల్రెడీ ఉన్న వారికి అది ఇంకా ఎక్కువ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు తలనొప్పి తగ్గుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడు నరాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దాని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

Migraine : చాక్లెట్..

ఈ రోజుల్లో చాక్లెట్ అనేది చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారిదాకా అందరూ తింటుంటారు. అయితే చాక్లెట్ లో ఉండే కెఫిన్, బీటా ఫెనిలేథైలమైన్ లాంటివి రక్తనాళాల్లో ఉద్రిక్తతను పెంచుతాయి. దాని వల్ల మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి చాక్లెట్లను తినకపోవడమే బెటర్.

Migraine : ఐస్ క్రీమ్..

ఎండాకాలంలో చల్లగా ఐస్ క్రీమ్ తినకుండా ఉండలేరు. చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువనే అవుతుంది. వ్యాయామం చేసిన వెంటనే లేదంటే ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటే మాత్రం మైగ్రేన్ నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

Migraine మైగ్రేన్ తో బాధపడుతున్నారా వేసవిలో వీటిని తింటే డేంజరే

Migraine : మైగ్రేన్ తో బాధపడుతున్నారా.. వేసవిలో వీటిని తింటే డేంజరే..!

Migraine :సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే. నారింజ, కివి, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తీసుకుంటే ఎండాకాలంలో చల్లదనం ఉంటుందని అంతా అనుకుంటారు. అయితే వీటిని తింటే మైగ్రేన్ నొప్పి అధికం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది నొప్పిని తీవ్రతరం చేస్తుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది