Home » Health » Are You Thirsty For The Same Thing But Very Dangerous
Health

Thirst : మీకు అదే పనిగా దాహం వేస్తుందా… అయితే చాలా డేంజర్…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 5, 2024, 7:00 am
Advertisement

Thirst : ఎండలు అనేవి మండిపోతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీని వలన ప్రజలు ఓవైపు ఎండ మరోవైపున తీవ్ర ఉక్క పోతతో ఎంతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనల్ని మనం నిజ్జలీకరణంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఉత్తమమైన మార్గం ప్రతిరోజు నీరు తాగటమే. నిజానికి శరీరానికి బాగా చమట పట్టిన లేక వేడిగా అనిపించిన దాహం తిరటానికి పావు నుండి అర లీటర్ నీరు అనేది సరిపోతుంది. దాహం అనిపించడం సాధారణం. కానీ ఎక్కువ నీరు త్రాగిన తర్వాత కూడా ఇది ఆగకపోతే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే. ఎండాకాలంలో పదేపదే దాహం అనేది వేస్తూ ఉంటుంది. కావున కొన్ని సందర్భాలలో దాహం వేస్తే ఏం కాదు. కానీ తరచు దాహం వేస్తేనే ప్రమాదం అని వైద్యులు తెలుపుతున్నారు…

Advertisement

కొంత మందికి ఎందుకు ఎక్కువ దాహం అనిపిస్తుంది : చాలా మంది దాహం తీర్చుకోవటానికి ఎన్నో గ్లాసుల నీరు తాగిన లేక చల్లటి రసం, శీతల పానీయాలు తాగిన వారి దాహం అనేది ఎప్పటికీ తీరదు. ఇలాంటి సందర్భాన్ని Polydipsia అని అంటారు. అయితే ఎక్కువ దాహం వేయటం అనేది కూడా ప్రమాదకరం. దీనిని నివారించడానికి వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. ఇది కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారవచ్చు. అయితే ఎక్కువగా దాహం వేయడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Thirst : మీకు అదే పనిగా దాహం వేస్తుందా… అయితే చాలా డేంజర్…!!

Advertisement

డిహైడ్రేషన్ : ఇప్పటికే శరీరంలో నీటి లోపం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటి లేఖ రెండు గ్లాసుల నీరు తాగితే దాహం అనేది తీరదు. కావున దీని కోసం గొంతును కొద్దిగా తడు పుతూనే ఉండాలి. అంటే కొంచెం కొంచెం నీరు తాగుతూ ఉండాలన్నమాట…

పొడి నోరు : చాలా మంది తమ నోటిలో తగినంత మొత్తంలో లాలాజల ఉత్పత్తి చేయరు. దీని కారణం వలన నోరు అనేది పొడిగా అనిపిస్తుంది. పదే పదే నీరు త్రాగినప్పటికీ కూడా వారి దాహం అనేది తీరదు…

Advertisement

మధుమేహం : డయాబెటిస్ ఎన్నో వ్యాధులకు మూలం. డయాబెటిస్ రోగుల ప్రదాన సమస్య ఏమిటి అంటే. వారు అధిక దాహం అనుభూతి చెందుతారు. ఈ సమస్య ఉన్నవారికి పదే పదే నీరు తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది…

ఆహార అలవాట్లు : మీరు గనక జంక్ ఫుడ్ లేక ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటే పదే పదే దాహం వేయటం చాలా సహజం…

రక్తహీనత : శరీరంలోని రక్తము అనేది లేకపోవటాన్ని రక్తహీనత అంటారు. హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే,నీరు తాగినప్పటికీ కూడా దాహం అనేది అనిపిస్తూ ఉంటుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి