
Salt : ఉప్పు ఎక్కువగా తింటున్నారా... అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకే...!
Salt : ప్రపంచ ఆరోగ్య సంస్థ తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సిఫారీస్ లు జారీ చేస్తూ ఉంటుంది. ఏ వ్యాధుల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యాధి తీవ్రమైనది.ఏది కాదు. అనే సమాచారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే కాక పౌరులు ఏ ఆహారాన్ని తీసుకోవాలి. ఏ ఆహారం తినకూడదు అనే సమాచారాలను కూడా తరచుగా అందిస్తూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టైంలో ఉప్పు గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా చెప్పాలంటే. ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉప్పు తినే వారికి ఏమి జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సమాచారాన్ని తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలకు సంబంధించిన సమస్యలు పెరగటం వలన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూస్తే, ఐరోపాలో ప్రతిరోజు కనీసం 10,000 మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు అని తెలిపింది. అంటే ఏటా 40 లక్షల మంది దాకా గుండె సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు. యూరప్ లో మొత్తం మరణాలలో 40% వరకు గుండె సమస్యల కారణంగా జరుగుతున్నాయి…
తొమ్మిది లక్షల మరణాలను నివారించవచ్చు : ఉప్పును ఎక్కువగా తీసుకోవటం వలన ఈ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఉప్పును తీసుకోవడం తగ్గించినట్లయితే ఈ సంఖ్యను కూడా తగ్గించుకోవచ్చు. కనీసం ఉప్పును తీసుకోవడం 25 శాతం వరకు తగ్గించాలి. ఇలా జరిగితేనే 2030 నాటికి తొమ్మిది లక్షల మరణాలు అరికట్టవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు.
ఒకటి స్పూన్ ఉప్పు సరిపోతుంది : ఐరోపాలో 30 నుండి 79 సంవత్సరాల మధ్య వయసు కలవారి ముగ్గురులో ఒకరు మాత్రం అధిక రక్తపోటుతో ఎంతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఉప్పే. ఐరోపాలో ఉన్న 53 దేశాలలో 51 దేశాలు రోజూ వారి ఉప్పులు 5 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐదు గ్రాముల ఉప్పు లేక ఐదు గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి అని సిఫారీస్ చేసింది. అలాగా ఒక టీ స్పూన్ లేక అంతకన్నా తక్కువ ఉప్పు తీసుకోవడం చాలా మంచిది. కానీ ఐరోపాలో మాత్రం దీనిని విస్మరించారు. యూరోపియన్లు ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ ఫుడ్, స్నాక్స్ తీసుకోవటానికి ఎంతో ఇష్టపడతారు. అందుకే ఈ ఆహారాలను తీసుకోవడం మానుకోవాలి అని అంటున్నారు.
Salt : ఉప్పు ఎక్కువగా తింటున్నారా… అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకే…!
చనిపోయిన వారిలో మగవారే ఎక్కువ : ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు అనేది పెరుగుతుంది. ఇది గుండె సమస్యలకు కూడా దారి తీస్తుంది. గుండెపోటు కూడా రావచ్చు అని ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే ఎక్కువ రక్తపోటు రోగులు యూరప్ లోనే ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూస్తే. ఈ గుండె సమస్యలతో మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. ఈ నిష్పత్తి అనేది 2.5.
30 నుండి 69 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు పశ్చిమ ఐరోపాల కంటే తూర్పు ఐరోపా మధ్య ఆసియా లో గుండె సమస్యలతో చనిపోయే అవకాశం అయిదు శాతం ఎక్కువగా ఉన్నది. ఉప్పు తినడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. కావున ఈ గుణాంకాలు ఐరోపాకు చెందినవే అయినప్పటికీ కూడా ఏ దేశంలోనైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అతను గుండె సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలుపుతున్నారు. అందువల్ల ఉప్పును మితంగా తినాలి అని ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్‌గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.