Thirst : మీకు అదే పనిగా దాహం వేస్తుందా… అయితే చాలా డేంజర్…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Thirst : మీకు అదే పనిగా దాహం వేస్తుందా… అయితే చాలా డేంజర్…!!

Thirst : ఎండలు అనేవి మండిపోతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీని వలన ప్రజలు ఓవైపు ఎండ మరోవైపున తీవ్ర ఉక్క పోతతో ఎంతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనల్ని మనం నిజ్జలీకరణంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఉత్తమమైన మార్గం ప్రతిరోజు నీరు తాగటమే. నిజానికి శరీరానికి బాగా చమట పట్టిన లేక వేడిగా అనిపించిన దాహం తిరటానికి పావు నుండి అర లీటర్ నీరు అనేది సరిపోతుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 June 2024,7:00 am

Thirst : ఎండలు అనేవి మండిపోతూ ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీని వలన ప్రజలు ఓవైపు ఎండ మరోవైపున తీవ్ర ఉక్క పోతతో ఎంతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనల్ని మనం నిజ్జలీకరణంగా, ఆరోగ్యంగా ఉంచుకోవటానికి ఉత్తమమైన మార్గం ప్రతిరోజు నీరు తాగటమే. నిజానికి శరీరానికి బాగా చమట పట్టిన లేక వేడిగా అనిపించిన దాహం తిరటానికి పావు నుండి అర లీటర్ నీరు అనేది సరిపోతుంది. దాహం అనిపించడం సాధారణం. కానీ ఎక్కువ నీరు త్రాగిన తర్వాత కూడా ఇది ఆగకపోతే వైద్యుల్ని సంప్రదించడం చాలా అవసరం. ముఖ్యంగా చెప్పాలంటే. ఎండాకాలంలో పదేపదే దాహం అనేది వేస్తూ ఉంటుంది. కావున కొన్ని సందర్భాలలో దాహం వేస్తే ఏం కాదు. కానీ తరచు దాహం వేస్తేనే ప్రమాదం అని వైద్యులు తెలుపుతున్నారు…

కొంత మందికి ఎందుకు ఎక్కువ దాహం అనిపిస్తుంది : చాలా మంది దాహం తీర్చుకోవటానికి ఎన్నో గ్లాసుల నీరు తాగిన లేక చల్లటి రసం, శీతల పానీయాలు తాగిన వారి దాహం అనేది ఎప్పటికీ తీరదు. ఇలాంటి సందర్భాన్ని Polydipsia అని అంటారు. అయితే ఎక్కువ దాహం వేయటం అనేది కూడా ప్రమాదకరం. దీనిని నివారించడానికి వైద్యులను సంప్రదించటం చాలా అవసరం. ఇది కొన్ని సందర్భాలలో ప్రమాదకరంగా మారవచ్చు. అయితే ఎక్కువగా దాహం వేయడం వెనక ఉన్నటువంటి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

Thirst మీకు అదే పనిగా దాహం వేస్తుందా అయితే చాలా డేంజర్

Thirst : మీకు అదే పనిగా దాహం వేస్తుందా… అయితే చాలా డేంజర్…!!

డిహైడ్రేషన్ : ఇప్పటికే శరీరంలో నీటి లోపం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటి లేఖ రెండు గ్లాసుల నీరు తాగితే దాహం అనేది తీరదు. కావున దీని కోసం గొంతును కొద్దిగా తడు పుతూనే ఉండాలి. అంటే కొంచెం కొంచెం నీరు తాగుతూ ఉండాలన్నమాట…

పొడి నోరు : చాలా మంది తమ నోటిలో తగినంత మొత్తంలో లాలాజల ఉత్పత్తి చేయరు. దీని కారణం వలన నోరు అనేది పొడిగా అనిపిస్తుంది. పదే పదే నీరు త్రాగినప్పటికీ కూడా వారి దాహం అనేది తీరదు…

మధుమేహం : డయాబెటిస్ ఎన్నో వ్యాధులకు మూలం. డయాబెటిస్ రోగుల ప్రదాన సమస్య ఏమిటి అంటే. వారు అధిక దాహం అనుభూతి చెందుతారు. ఈ సమస్య ఉన్నవారికి పదే పదే నీరు తాగాలి అని అనిపిస్తూ ఉంటుంది…

ఆహార అలవాట్లు : మీరు గనక జంక్ ఫుడ్ లేక ఎక్కువ స్పైసీ ఫుడ్ తింటే పదే పదే దాహం వేయటం చాలా సహజం…

రక్తహీనత : శరీరంలోని రక్తము అనేది లేకపోవటాన్ని రక్తహీనత అంటారు. హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే,నీరు తాగినప్పటికీ కూడా దాహం అనేది అనిపిస్తూ ఉంటుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది