
back pain and anemia joint pain treatment in telugu
Joint Pains : మన శరీరానికి సంపూర్ణ పోషణ అందించే అద్భుతమైన లడ్డుని పరిచయం చేయబోతున్నాం. మరి ఈ లడ్డు తింటే ఎన్నో రకాల రోగాలు నయమైపోతాయి. కంటి చూపు మెరుగవుతుంది. నరాల బలహీనత తగ్గుతుంది. ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఎన్ని ప్రయోజనాలు ఉన్న ఈ లడ్డు రోజుకి ఒకటి లేదా రెండు చొప్పున తింటే డాక్టర్ అవసరమే లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇదిగో ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ లడ్డు రోజుకి రెండు తింటే చాలు.. ఈ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి.
చాలా అద్భుతమైన లడ్డు. ఇది ఈ లడ్డు డెలివరీ అయిన తర్వాత తల్లులకు పిల్లలకు కూడా పెట్టొచ్చు. అంత ఆరోగ్యవంతమైన లడ్డు ఇది మరి ఈ లడ్డు తయారు చేయడానికి ఏమేం కావాలి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా అవసలు 200 గ్రాములు, నువ్వులు 200 గ్రాములు తీసుకోండి. అలాగే బెల్లం 300 గ్రాములు తీసుకోండి. గోధుమపిండి ఒక చిన్న కప్పు, నెయ్యి 100 గ్రాములు తీసుకోండి. జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్ యాభై గ్రాములు గోండు 50 గ్రాములు, ఈ గోందు మీకు ఆయుర్వేదిక్ స్టోర్స్ లో ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. అందులో నువ్వులు వేసి వేయించండి.
తర్వాత ఈ నువ్వులను ఒక ప్లేట్లు వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే బాండీలో అవిస గింజలు నువ్వులు వేయించినట్టుగానే వేయించండి. ఇలా వేగిన అవిస గింజలను మరొక ప్లేట్ లో వేసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే బాండీలో నెయ్యి వేసుకుని మనం తీసుకున్న జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత గొందుని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించి తీసేసుకున్నాం కదా మరి బాండిలో మిగిలిన నెయ్యిని కొంచెం పక్కకు తీసేయండి. మిగిలిన నెయ్యిలో మనం తీసుకున్న గోధుమ పిండిని కూడా దోరగా వేయించుకోండి. బౌల్లో వేసి చల్లారనివ్వండి.
back pain and anemia joint pain treatment in telugu
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని పొడిపొడిగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత నువ్వులని అవసరం కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక బౌల్లో బెల్లాన్ని పాకం పట్టి బెల్లం నీటిని దాన్లో పోసి లడ్డుల్లా చుట్టుకోవాలి. మీకు ఎంత సైజులో అయితే లడ్డూలు కావాలో ఆ సైజులో మీరు లడ్డూలు చుట్టేసుకోవడమే మనం తీసుకున్న నువ్వులు అవిస గింజల్లో నూనె శాతం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ లడ్డు చేయడానికి మనకి నెయ్యి ఎక్కువగా అవసరం ఉండదు. పెద్దవాళ్ళు ఎవరైనా కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే గనక వాళ్ళకి చక్కగా ఈ లడ్డు చేసి పెట్టండి చాలా తొందరగా ఆ నొప్పుల నుంచి బయటపడవచ్చు…
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
This website uses cookies.