Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే… ఆ ఫీలింగే వేరబ్బా… ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే… ఆ ఫీలింగే వేరబ్బా… ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే... ఆ ఫీలింగే వేరబ్బా... ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్...?

Bananas Leaves : పురాతన కాలంలో పచ్చని ఆకులలో భోజనాలని చేసేవారు. ఆ రోజుల్లో ఇతరులు అంటే మోదుకాకులతో చేసిన విస్తర్లు, ఇంకా అరటి ఆకులలో భోజనాన్ని చేసేవారు. కానీ సాంప్రదాయపరంగా ఆకులలో భోజనం చేయడం ఆనవాయితీ. కానీ ఈ రోజుల్లో అవి కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ తో చేసిన విస్తరణ ఎక్కువగా వినియోగిస్తున్నారు. కానీ పచ్చని అరటి ఆకులలో భోజనం చేస్తే, శాస్త్రీయ కారణాల నుంచి జెనిటిక్ యోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆకులలో భోజనం చేస్తే కఫా, వాతాలు కూడా తగ్గిపోతాయి. శరీరానికి ఎంతో బలం చేకూరుతుంది. బాగా ఆకలి కూడా వేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి కూడా లభిస్తుంది. అరటి ఆకుల్లో తింటే, ఆహారం మరింత రుచి పెరుగుతుంది. భోజనం మంచి రుచిని అందించడమే కాక ఎన్నో ఆరోగ్య లాభాలను ఇస్తుంది. భోజనం ఎంత ఆరోగ్యమో, దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం……

Bananas Leaves పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే ఆ ఫీలింగే వేరబ్బా ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్

Bananas Leaves : పచ్చని అరటి ఆకులో భోజనం చేస్తే… ఆ ఫీలింగే వేరబ్బా… ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదుర్స్…?

Bananas Leaves అరటి ఆకులలో భోజనం ఆరోగ్యం

అరటి ఆకులలో పాలి ఫైనల్స్, విటమిన్ -A,విటమిన్ – C, అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకులపై ఆహారాన్ని ఉంచినప్పుడు, ఈ పోషకాల్లో కొన్ని ఆహారానికి బదిలీ అవుతాయి. మీరు తినే ఆహారం పోషక విలువలను పెంచుతుంది. అరటి ఆకుల్లో ఆహారం తీసుకుంటే ఆహారం మరింత రుచిగా ఉంటుంది ఆకుల్లో ఆహారాన్ని తేలికపాటి, రుచి మరింత అందిస్తుంది. ఆహారం రుచిని పెంచటమే కాదు, ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల ఆహారానికి సాంప్రదాయ ఆకర్షణ కూడా లభిస్తుంది.మీరు మంచి హృదయంతో ఆహారం తీసుకుంటే, అది మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అరటి ఆకులు, ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ ప్లేట్లలో పోలిస్తే విషపూరితం కాదు. కాబట్టి, హానికరమైన రసాయనాలు ఆహారంలో చేరవు. ఈ అరటి ఆకుల్లో భోజనం చేస్తే క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఆకులపై ఆహారం తీసుకుంటే జీర్ణ క్రియపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఆకుల్లో పాలిఫెనాల్స్, జీర్ణ ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. మంచి జీవ క్రియకు, పోషణలను గ్రహించడానికి సహకరిస్తుంది.

అరటి ఆకులలో సహజ యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆహారంలోని హానికరమైన బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి. అందువల్ల అరటి ఆకులపై ఆహారం తీసుకుంటే,ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అరటి ఆకుల్లో ఆహారం పెట్టుకొని తింటే త్వరగా జీర్ణం అవుతుంది. అరటి ఆకులు ఉపయోగించి, పర్యావరణ అనుకూల ఎంపిక చేయాలి.ఇది ప్లాస్టిక్ లేదా ఫామ్ ప్లేట్లను అవసరాన్ని తగ్గించి, భూమి కాలుష్యాన్ని తగ్గించాలి. పేపర్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన అరటి ఆకులో భోజనం చేసి,మంచి ఆరోగ్యాన్ని పెంచుకోండి. అరటి ఆకులో భోజనం చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది