Health Benefits : అరటి ఆకులో భోజనం… ఆరోగ్యానికి ఎంతో లాభం…!!
Health Benefits : అరటి ఆకులలో భోజనం చేయటం అనేది భారతదేశంలో చాలా ఏళ్లుగా కొనసాగుతూనే వస్తున్నది. అయితే దక్షిణ భారతదేశంలో చాలా మంది అరటి ఆకులను ఆహారంగా వాడతారు. దక్షిణాది ప్రజలు పాత్రలకు బదులుగా అరటి ఆకులలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా చెప్పవచ్చు. ఈ పద్ధతి ఎన్నో వ్యాధులను నివారించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో సహజ సిద్ధమైన కార్బన్ సమ్మేళనాలు అనేవి ఉంటాయి. దీనిలో భోజనం చేస్తే ఈ సహజమైన కర్బర సమ్మేళనాలు శరీరంలోనికి ప్రవేశిస్తాయి. కావున ఇవి కాన్సర్, గుండె సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాక శరీరానికి అవసరమైన పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి. నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ గాను పనిచేస్తాయి. దీనిలో వ్యాధి నిరోధక గుణాలు వలన సూక్ష్మజీవులు అనేవి నాశనం అవుతాయి. అరటి ఆకులలో ఆహారం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
సహజంగా క్రిములను చంపుతుంది : అరటి ఆకులలో సహజసిద్ధమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు అనేవి ఉన్నాయి. ఇవి ఆహారం లో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని చంపడంలో ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల అరటి ఆకులపై ఆహార తినటం వలన ఫుడ్ వలన వచ్చే వ్యాధుల ప్రమాదాలను తగ్గించవచ్చు..
పోషకాహారం ఎంత : అరటి ఆకులలో పాలిఫైనల్స్, విటమిన్ ఎ,విటమిన్ సి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. అరటి ఆకుపై ఆహారాన్ని ఉంచినప్పుడు ఈ పోషకాలు కొన్ని ఆహారం లోకి వెళ్లి, దాని పోషణ మరింత మెరుగు పరుస్తాయి..
విషపూరితం కానిది : కొన్ని సింథటిక్ ప్లేట్లు వలే అరటి ఆకులు విషపూరితం కావు. అరటి ఆకులలో ఆహారం ఆరోగ్యకరమైన రసాయనాలను డిలీట్ చేస్తుంది. దీని కారణం వలన ఆహారం అనేది సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని కలిగించదు.
పర్యావరణ అనుకూలమైనది : మీరు డిస్పోజబుల్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులను వాడుకోవచ్చు. ఇది పర్యావరణకు అనుకూలమైనదిగా చేసేందుకు సహాయం చేస్తుంది. ఇది ప్లాస్టిక్ లేక ఫోమ్ ప్లేట్ల అవసరాన్ని తగ్గిస్తుంది. ఇది కాలుష్యాన్ని కూడా తగ్గించగలదు..
బయోడిగ్రేడబుల్ : వీటిని శుభ్రపరచటం కూడా తేలికే. మంచి నీటిలో కరిగి వాడుకోవచ్చు. తేలికగా భూమిలో కూడా కలిసిపోతుంది. కావున ఇది పర్యావరణ హితమైనది అని కూడా చెప్పవచ్చు..
జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది : అరటి ఆకులపై ఆహారం తినటం వలన జీర్ణక్రియపై మంచి ప్రభావం కూడా చూపుతుంది. అరటి ఆకులలో ఉండే పాలిఫెనాల్స్ ఎంజామ్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇది మంచి జీర్ణక్రియ పోషకాలను గ్రహించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది..
ఆరోగ్యానికి వరం : ప్లాస్టిక్ పాత్రలో వేడి ఆహారాన్ని తీసుకోవటం వలన కొన్ని ప్లాస్టిక్ కణాలు అనేవి ఆహారంలోకి వస్తాయి. ఇది ఆరోగ్యం పై ఎంతో ప్రభావం చూపుతుంది. అదే టైమ్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరటి ఆకులలో ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేయగలదు. సాధారణ ప్లేట్లను డిటర్జెంట్లు ఉపయోగించి శుభ్రం చేస్తారు. దీని వలన దానిలో రసాయన అవశేషాలు అనేవి ఆహారంలో కలిసి శరీరంలోకి ప్రవేశిస్తాయి. కావున ఎటువంటి ఇబ్బందులు అరటి ఆకులతో ఉండవు…