Beauty Tips : ఎర్రచందనం లో ఈ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు…. అందమైన చర్మం మీ సొంతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : ఎర్రచందనం లో ఈ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు…. అందమైన చర్మం మీ సొంతం…!

Beauty Tips : మన చర్మ సౌందర్యానికి ఎర్రచందనాన్ని వాడారు అంటే ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఈ ఎర్రచందనాన్ని కొన్ని దశాబ్దాలుగా చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఎర్రచందనంతో ఈ పదార్థాలు కలుపుకొని ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ పేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎర్రచందనం, బొప్పాయి పేస్ ప్యాక్ : రెండు లేక మూడు […]

 Authored By ramu | The Telugu News | Updated on :17 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Beauty Tips : ఎర్రచందనం లో ఈ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు.... అందమైన చర్మం మీ సొంతం...!

Beauty Tips : మన చర్మ సౌందర్యానికి ఎర్రచందనాన్ని వాడారు అంటే ముఖం ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది. అయితే ఈ ఎర్రచందనాన్ని కొన్ని దశాబ్దాలుగా చర్మ సౌందర్యానికి వాడుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఎర్రచందనంతో ఈ పదార్థాలు కలుపుకొని ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ పేస్ ప్యాక్ ను ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం.

ఎర్రచందనం, బొప్పాయి పేస్ ప్యాక్ : రెండు లేక మూడు చెంచాల ఎర్రచందనం పొడిలో బొప్పాయి గుజ్జు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నుండి 30 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా మీరు రెండు వారాలకి ఒకసారి ట్రై చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే ఈ పేస్ ప్యాక్ ను అప్లై చేసుకోవడం వలన మీ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడమే కాక మీ చర్మం ఎంతో కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. అలాగే మీ చర్మం ఆరోగ్యంగా మరియు ప్రతిరోజు తాజాగా ఉండేలా చేయడంలో కూడా ఇది ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తుంది.

Beauty Tips ఎర్రచందనం, పాలు, తేనె ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేసుకునేందుకు సరిపోను ఎర్రచందనం పొడిని తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల పాలు మరియు ఒక టెబుల్ స్పూన్ తేనెను కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని సుమారు అరగంట పాటు ఆరనివ్వాలి. ఇది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా గనక మీరు రెండు రోజులకు ఒకసారి ట్రై చేస్తే ముఖంపై ఉన్న మురికి అనేది తొలగిపోయి ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది…

పెరుగు, ఎర్రచందనం ఫేస్ ప్యాక్ : దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ఎర్రచందనం పొడిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఐదు నుండి పది నిమిషాల పాటు అలా ఉంచి తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా గనుక మీరు ప్రతిరోజు రాత్రి నిద్ర పోయే ముందు ట్రై చేస్తే మీకు ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే ముఖంపై ఉండే మచ్చలు మరియు మొటిమలు కూడా తొలగిపోతాయి.

Beauty Tips ఎర్రచందనం లో ఈ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు అందమైన చర్మం మీ సొంతం

Beauty Tips : ఎర్రచందనం లో ఈ పదార్థాలు కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చాలు…. అందమైన చర్మం మీ సొంతం…!

ఎర్రచందనం, రోజు వాటర్ పేస్ ప్యాక్ : ఈ ఎర్ర చందనములో సరిపోను రోజువాటర్ను కలుపుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని 10 నుండి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు మీరు ట్రై చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దీంతో ముఖంపై ఉన్న మచ్చలు మరియు మొటిమలు కూడా తగ్గిపోతాయి. అలాగే ముఖం ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.

 

ఎర్రచందనం,నిమ్మకాయ పేస్ ప్యాక్ : ఎర్రచందనం పొడిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దానిని 15 నిమిషాల తర్వాత చల్లని వీటితో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒక్కసారి గనుక మీరు ట్రై చేస్తే మీ చర్మంపై ఉన్న జిడ్డు అనేది తొలగిపోతుంది. అలాగే మీ చర్మం రంధ్రాలను బిగుతుగా చేసి ఎక్కువ నూనెలను కూడా రిలీజ్ అవ్వకుండా చేస్తుంది. అలాగే మీ చర్మం అనేది ఎంతో కాంతివంతంగా మెరిసేలా కూడా చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది