
Benefits Of Bilva Patra
పండుగ అయినా.. పెళ్లి అయినా సరే మరి ఇతర శుభకార్యాలైన ఇంటికి తోరణాలుగా పచ్చని ఆకులు కడుతూ ఉంటారు. ఇది కేవలం అలంకారం మాత్రం కాకుండా దీనికి కూడా సైంటిఫిక్ రీసన్స్ ఉన్నాయి. ఎటువంటి దుష్ప్రభావాలు లోపలికి రాకుండా చెడు బ్యాక్టీరియాల్ కానీ మరే ఇతర క్రిమి కీటకాలు ఇంటిలోకి రాకుండా ఉండడానికి ఈ పచ్చడి ఆకులను తోరణాలుగా కట్టేవారు.. అంతే కాదు ఇటువంటి పచ్చని ఆకులు ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులను కూడా నయం చేసుకునేవారు.. అమృతంతో సమానమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే ఒక ఆకు గురించి మీకు చెప్పబోతున్నాను.. ఈ ఆకు పేరు చెబితే చాలు.. ఆయుర్వేద డాక్టర్లు కళ్ళు మూసుకుని వాడమని అంటారు. ఎందుకంటే ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడంలో ముందు వరుసలో ఉంటుంది ఈ ఆకు.
మరి ఈ ఆకు విశిష్టతలు ఏంటి.? ఈ ఆకు ఎక్కడ దొరుకుతుంది. ఈ ఆకును ఎలా వాడాలి? ఎటువంటి వ్యాధులకు ఎలా పనిచేస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. హిందువులు వేప చెట్టు, రావి చెట్టు మారేడు చెట్టు ఇలా ఎన్నో చెట్లను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు. ఇలాంటి వృక్షాలలో ఎంతో ముఖ్యమైనది మారేడు చెట్టు. పూర్వకాలం నుండి ఈ చెట్టు ప్రాచర్యలో ఉంది. ఈ మారేడు చెట్టు అంటే పరమశివునికి ఎంతో ప్రీతికరం. మారేడు చెట్టు ఖనిజాలు, విటమిన్లు కలిగి ఉంటుంది. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ అలాగే విటమిన్ బి సి పుష్కలంగా ఉంటాయి. దీని ఆకుల రసం షుగర్ వ్యాధి నివారణకు చాలా మంచిది. మారేడు పళ్ళు వాసన భలే ఉంటుంది. ఈ పండుక విరోచన కారిగా కూడా పనిచేస్తుంది. ఎసిడిటీ, గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవాళ్లు మారేడు ఆకులతో కషాయం చేసుకొని తాగడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
Benefits Of Bilva Patra
అలాగే చర్మవ్యాధులను తగ్గించడంలో క్యాన్సర్ కారకాలతో పోరాటంలో ముందుంటుంది. అలాగే రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదంలో మారేడు వేరును ఉపయోగిస్తారు. మారేడు ఆకుల రసం ఉన్న వాళ్ళు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. మారేడు ఆకులని బిల్వదళాలు లేదా బిల్వ ఆకులు అని కూడా అంటారు. ఈ ఆకుల రసం తీసి కొంచెం తేన కలిసి తాగడం వల్ల జ్వరం తగ్గుతుంది. ఈ చెట్టు ఆకుల రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఇక మారేడుపళ్ళ రసానికి అల్లం రసం కలిపి తీసుకుంటే రక్తానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఇక ఈ మారేడు ఆకులను వేరును, బెరడును కలిపి మెత్తగా నూరి ఈ మిశ్రమాన్ని గాయాలు పై ఉంచితే మీకు ఎప్పటినుంచో మానకుండా లేదా తరచుగా మీకు శరీరంపై గాయాలు వస్తూ ఉన్న ఈ గుజ్జును గాయాలపై వేస్తే త్వరగా మానిపోతాయి. అంతే కాకుండా ఈ చెట్టు ఆకులకు ఊబకాయాన్ని తగ్గించే శక్తి కూడా ఉందని పరిశోధనలో తేలింది. అందుకే అధిక బరువుతో బాధపడే వాళ్ళు ప్రతిరోజూ మారేడు ఆకులను తీసుకోవడం అలవాటు చేసుకుంటే చక్కగా ఈజీగా బరువు తగ్గిపోతారు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.