#image_title
ICC World Cup 2023 : ఐసీసీ వరల్డ్ కప్ 2023 లో భారత్ దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాపై గెలిచింది. అసలే సొంత గడ్డ.. ఇక్కడ గెలవకపోతే ఎలా ఉంటది చెప్పండి. అందుకే ఈసారి టైటిల్ ఫేవరేట్ గా భారత్ వరల్డ్ కప్ బరిలోకి దిగింది. అయితే.. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్ లో ఆదిలోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే రెండు రన్స్ కే మూడు వికెట్లు పోయాయి. దీంతో ఇక మ్యాచ్ పని అయిపోయింది అనుకున్నారు క్రికెట్ అభిమానులు. తొలి మ్యాచ్ లోనూ భారత్ ఓడిపోబోతోంది అనుకున్నారు. కానీ.. టీమిండియాను విరట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గెలిపించారు. ఇద్దరూ కలిసి పార్టనర్ షిప్ తో 165 పరుగులు తీశారు. దెబ్బకు భారత్ గెలుపు వైపు పరుగులు తీసింది.
విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరికి వచ్చి 85 పరుగులు చేసి అవుట్ కాగా.. అప్పుడు బ్యాటింగ్ కి దిగిన హార్ధిక్ పాండ్యా.. కేఎల్ రాహుల్ సెంచరీ చేయకుండా మిస్ చేశాడని అంటున్నారు. ఎందుకంటే.. రాహుల్, పాండ్యా ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేఎలా రాహుల్ 93 పరుగులు చేశాడు. అంటే.. ఇంకో 7 పరుగులు చేస్తే రాహుల్ సెంచరీ చేసినట్టే. అందుకే రాహుల్ ముందు ఒక ఫోర్ కొట్టి.. ఆ తర్వాత 6 కొడితే మ్యాచ్ అయిపోతుంది.. మరోవైపు తన సెంచరీ కూడా పూర్తవుతుంది అని భావించాడు. తను 93 పరుగులు చేసినప్పుడు కేవలం 5 పరుగులు మాత్రమే ఇంకా కావాల్సి ఉంది భారత్ కు. అదే సమయంలో ఫోర్ కొట్టాడు. 97 పరుగులకు మైలురాయికి చేరుకున్నాడు. ఇంకో సిక్స్ కొట్టి సెంచరీ చేద్దామనుకున్నాడు. కానీ.. 40వ ఓవర్ లో హార్ధిక్ పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్ ను ముగించేశాడు. రాహుల్ సెంచరీని కూడా మిస్ చేశాడు.
#image_title
ఒకవేళ పాండ్యా సిక్స్ కొట్టకుండా ఉంటే.. రాహుల్ సెంచరీ పూర్తయ్యేదని.. రాహుల్ సెంచరీ పూర్తి కాకుండా పాండ్యా అడ్డుకున్నాడని అంటున్నారు. హార్ధిక్ పాండ్యాను సెంచరీ విలన్ అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదివరకు వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో కూడా తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయకుండా పాండ్యా సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు. ఇప్పుడు ఇలా రాహుల్ విషయంలో సెంచరీ మిస్ అయింది.. అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.