Honey : చలికాలంలో ప్రతిరోజు ఉదయం తేనె తింటే ఎన్ని ప్రయోజనాలో…!
Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ తేనె తింటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. మరి ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే తేనె తీసుకోవడం చాలా మంచిదని ఈ విధంగా చేయడం వలన రీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనే ప్రతిరోజు ఉదయాన్నే […]
ప్రధానాంశాలు:
Honey : చలికాలంలో ప్రతిరోజు ఉదయం తేనె తింటే ఎన్ని ప్రయోజనాలో...!
Honey : తేనె ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్ తేనె తింటే చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. మరి ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజు ఉదయాన్నే తేనె తీసుకోవడం చాలా మంచిదని ఈ విధంగా చేయడం వలన రీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇక తేనెలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. మరి ఇంతటి అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన తేనే ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం .
Honey : జలుబు దగ్గు చెక్ …
చలికాలం వచ్చిందంటే చాలు అందర్నీ ఇబ్బంది పెట్టే సమస్య జలుబు దగ్గు. చలికాలం వచ్చిందంటే దాదాపు ప్రతి ఒక్కరు ఈ సమస్యలను ఎదుర్కొంటారు. మరి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే తేనె తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ప్రతిరోజు ఉదయాన్నే తేనే తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడంతో పాటు గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది. కావున ప్రతిరోజు ఉదయాన్నే తేనె తినడం చాలా మంచిది.
Honey అంటు వ్యాధులకు…
దీనిలో రోగ నిరోధక శక్తిని పెంచే మెగ్నీషియం కాల్షియం ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.
తేనెలో లభించే ఈ గుణాలు అంటువ్యాధులకు చెక్ పెట్టగలవు. అలాగే గొంతు సమస్యల నుంచి కూడా ఇది మనల్ని రక్షిస్తుంది.
శ్వాసకోశ వ్యాధులు : ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె మరియు కొద్దిగా నిమ్మరసం కలుపుకొని తాగితే శ్వాస కోస సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే దీనిలో నిమ్మరసంకి బదులుగా లవంగం పొడిని కలుపుకుని తీసుకున్న మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం తీసుకోవడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం : ప్రస్తుతం ఉన్న బిజీ యుగంలో చాలామంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగా అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ప్రతిరోజు ఉదయం హెర్బల్టిలో ఒక చెంచా తేనె కలుపుకొని తీసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.