మీ భార్య లావుగా ఉందని ఫీల్ అవుతున్నారా .. అయితే ఈ న్యూస్ మీ కోస‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మీ భార్య లావుగా ఉందని ఫీల్ అవుతున్నారా .. అయితే ఈ న్యూస్ మీ కోస‌మే..!

 Authored By aruna | The Telugu News | Updated on :30 June 2023,8:00 pm

కొందరు మనిషిలోని లోపాలను వేలెత్తి చూపిస్తుంటారు. దీంతో వాళ్లు మానసికంగా కృంగిపోతుంటారు. మనుషులంతా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా, వేరు వేరు ఆలోచనలను కలిగి ఉంటారు. అంతేకానీ అన్నింటిలో నేనే ఎక్కువ వాళ్ళు తక్కువ అని ఎవరిని కించపరచకూడదు. అది వారిని మానసికంగా వేధించినట్లు అవుతుంది. ఇక మన సొసైటీలో ఎదుటివారిని చూసి ఎగ్గులు పెట్టడం కామన్. లావుగా ఉన్నావ్, పొట్టిగా ఉన్నావ్, నీకేం చేతకాదు ఇలా ఎన్నో సూటి పోటి మాటలతో మనసులను గాయపరుస్తుంటారు. అయితే పెళ్లి అనే బంధంలో భార్యాభర్తల మధ్య ఇలాంటివి అస్సలు ఉండకూడదు.

భార్యాభర్తల మధ్య కేవలం ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. అప్పుడే వారి బంధం పది కాలాలపాటు చల్లగా ఉంటుంది. అయితే కొందరు భార్య లావుగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే లావుగా ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయట. లావుగా ఉండే అమ్మాయిలు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉంటారు. కుటుంబాన్ని అర్థం చేసుకుని ముందుకు నడిపిస్తారు. వారి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తన భర్తను ఎంతగానో ప్రేమిస్తారు. తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. వారు తమ అందం కంటే భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారు.

benefits of marrying a weight loss women

benefits of marrying a weight loss women

లావుగా ఉండే అమ్మాయిలు చాలా సింపుల్ గా ఉంటారు. మంచి హృదయాన్ని కలిగి ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. వారితో మాట్లాడడం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది.తమ భర్త అన్నింటిలోను ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. అన్ని సమయాల్లో భర్త వెంటే ఉంటారు. సమస్యలు రాకుండా చూసుకుంటారు. భాగస్వామికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు. ఏదేమైనా ఇద్దరు భార్యాభర్తల మధ్య గౌరవం ప్రేమాభిమానాలు ఉంటే ఆ బంధం కలకాలం వర్ధిల్లుతుంది. ఎంచుకున్న భాగస్వామి ఎలా ఉందనే విషయం కాదు మీ రిలేషన్ షిప్ ఎంత బలంగా ఉందో గుర్తించాలి.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది