Tortoise Ring : తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే చాలు… కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tortoise Ring : తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే చాలు… కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!!

Tortoise Ring : మన భారతీయ సాంప్రదాయాలలో జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్ర ప్రకారం చూస్తే, తాబేలును మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలాగే ఈ తాబేలును సంపాదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటాము. అలాగే ఎంతో మంది తాబేలు ఉంగరాన్ని వేలికి ధరిస్తూ ఉంటారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకునే విషయంలో మాత్రం కొన్ని నియమాలను కచ్చితంగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :14 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Tortoise Ring : తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే చాలు... కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు...!!

Tortoise Ring : మన భారతీయ సాంప్రదాయాలలో జ్యోతిష్య శాస్త్రం మరియు వాస్తు శాస్త్ర ప్రకారం చూస్తే, తాబేలును మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అలాగే ఈ తాబేలును సంపాదకు కూడా చిహ్నంగా భావిస్తూ ఉంటాము. అలాగే ఎంతో మంది తాబేలు ఉంగరాన్ని వేలికి ధరిస్తూ ఉంటారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు దొరుకుతుంది. కానీ ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకునే విషయంలో మాత్రం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే ఆ నియమాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అయితే రాగి మరియు ఇత్తడితో చేసిన తాబేలు ఉంగరాల కంటే కూడా వెండితో చేసినటువంటి తాబేలు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిది. అయితే ఈ ఉంగరాన్ని మాత్రం మధ్య వేలి కి లేక చూపుడు వేలికి మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఈ ఉంగరాన్ని పెట్టుకునే ముందు పాలతో శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత గంగాజలం తో కూడా శుద్ధి చేయాలి. దాని తర్వాత ఈ ఉంగరాన్ని లక్ష్మీదేవి లేక దుర్గమ్మ ఫోటో దగ్గర ఉంచి శ్రీ సుక్త పారాయణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే ఈ ఉంగరాన్ని ధరించాలి…

Tortoise Ring తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే చాలు కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు

Tortoise Ring : తాబేలు ఉంగరాన్ని ఇలా ధరిస్తే చాలు… కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు…!!

తాబేలు అనేది లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ ఉంగరాన్ని మాత్రం శుక్రవారం రోజున ధరిస్తే చాలా చాలా మంచిది. అలాగే ఎటువంటి కారణాలతో నైనా ఈ తాబేలు ఉంగరాన్ని తీసేసిన మళ్లీ ఆ ఉంగరాన్ని లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచినా తర్వాత మాత్రమే ధరించాలి. అలాగే ఈ తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవడం వలన ఆర్థిక కష్టాల నుండి కూడా బయటపడతారు అని నమ్ముతారు. అంతేకాక మనిషిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ఇది ఇంట్లో పూరోభివృద్ధిని కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే ఈ తాబేలు ఉంగరం మీ జీవితంలో ఉన్నటువంటి లోపాలను కూడా పోగోడుతుంది

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది