Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా…. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా…. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా…!!

Toenail : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ముఖం మరియు చేతులపై చూపించే శ్రద్ధ పాదాలపై అస్సలు పెట్టరు. అంతేకాక చేతి గోళ్ళలను కూడా చాలా మంది ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. అదే శ్రద్ధ కాలి యొక్క గొళ్ళ పై అసలు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మాత్రం కాళ్ళ గోళ్ళను అసలు పట్టించుకోరు. అప్పుడు కాళ్లపై ట్యాన్ అనేది ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పాదాలపై దూళి మరియు […]

 Authored By ramu | The Telugu News | Updated on :7 October 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా.... దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా...!!

Toenail : ప్రస్తుత కాలంలో ఎంతోమంది తమ అందంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే ముఖం మరియు చేతులపై చూపించే శ్రద్ధ పాదాలపై అస్సలు పెట్టరు. అంతేకాక చేతి గోళ్ళలను కూడా చాలా మంది ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు. అదే శ్రద్ధ కాలి యొక్క గొళ్ళ పై అసలు ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మాత్రం కాళ్ళ గోళ్ళను అసలు పట్టించుకోరు. అప్పుడు కాళ్లపై ట్యాన్ అనేది ఏర్పడుతుంది. నిజం చెప్పాలంటే వర్షాకాలంలో పాదాలపై దూళి మరియు బురద అనేది చేరుతుంది. అలాగే నిల్వ ఉన్న నీళ్లలో నడిస్తే కాలి వేళ్ళ మధ్య మరియు కాలి గొళ్ళ దగ్గర ఫంగస్ మరియు బ్యాక్టీరియా అనేది చేరుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. అయితే ఎంతోమంది తమ కాళ్ళ గోర్లను సరిగ్గా క్లీన్ చెయ్యరు. దీని ఫలితంగా గోరు మూలల్లో మురికి అనేది పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కు కూడా దారితీస్తుంది. అలాగే ఒక్కొక్కసారి గోర్లు పసుపు రంగులోకి కూడా మారుతాయి. అంతేకాక గొర్ల మూలాలు నల్లగా కూడా మారతాయి. అలాగే గోర్లల్లో చీము కూడా పేరుకుపోతుంది…

కాళీ గోర్లకు ఇన్ఫెక్షన్లు ఇతర కారణాల వలన కూడా వస్తాయి. అయితే మొదటిది చెప్పులు లేకుండా ఎక్కువగా నడిచే వారిలో కాలి గోర్లలో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఎక్కువగా నడిచిన కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాక పాదాలను మరియు కాలి వేళ్ళ ను నిత్యం కచ్చితంగా క్లీన్ చేయకపోయినా మరియు కాలి వేళ్ళ పై దుమ్ము మరియు ధూళి పేర్కొన్న సరే ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. అలాగే ఎంతో సున్నితమైన చర్మం ఉన్నవారు ఇతరులు వాడే టవల్స్ లేక నెయిల్ క్లిప్పర్ లను వాడిన కాలి గోర్లు ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది.

Toenail కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా

Toenail : కాలి గోర్లకు ఇన్ఫెక్షన్ వచ్చిందా…. దీనికి పరిష్కారం ఏమిటో తెలుసా…!!

గోళ్ళకు ఇన్ఫెక్షన్ వస్తే ఏమి చేయాలంటే : టీ ట్రీ ఆయిల్ అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ నయం చేయటంలో ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. అంతేకాక దీనిని వ్యాధి సోకిన ప్రదేశములో నిత్యం కచ్చితంగా వాడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. అయితే దీనికోసం రెండు స్పూన్ల టీ ట్రీ ఆయిల్ ను ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ తో తీసుకొని గొళ్ళ పై ప్రభావిత ప్రాంతంలో మరియు దాని చుట్టూ ఉన్న చర్మంపై అప్లై చేసుకోవాలి. ఇలా గనక మీరు నిత్యం కచ్చితంగా చేసినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది. అయితే టి ట్రీ ఆయిల్ రాసుకున్న వెంటనే సాక్స్ లేక షూస్ వేసుకోకూడదు. అలాగే ఒక స్పూన్ టీ ట్రీ ఆయిల్ ని ఒక చెంచా విటమిన్ ఈ ఆయిల్ ను మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ తో ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. మీరు ఇలా చేయటం వలన గాయం అయిన ప్రాంతంలో మంటను మరి ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది…

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది