Brain Food : కూరగాయలలో ఈ భాగాలను వృధాగా పడేస్తున్నారా..? ఇవే మీ మెదడుకి వరం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Brain Food : కూరగాయలలో ఈ భాగాలను వృధాగా పడేస్తున్నారా..? ఇవే మీ మెదడుకి వరం…!

 Authored By tech | The Telugu News | Updated on :12 March 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Brain Food : కూరగాయలలో ఈ భాగాలను వృధాగా పడేస్తున్నారా..? ఇవే మీ మెదడుకి వరం...!

Brain Food : అందరూ సహజంగా కూరగాయలను వాడుకొని పనికిరాని వాటిని పడేస్తూ ఉంటారు. అంటే కూరగాయల పొట్టు వాటిలో గింజలు, కోడిగుడ్డు పెంకులు ఇలా అన్నిటిని పడేస్తూ ఉంటారు. అయితే ఈ పనికిరాని వాటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్ కి ఎంతగానో ఉపయోగపడతాయట ఈ భాగాలు. అయితే వృధాగా పడేసి వాటిలో మెదడుకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. మానవ శరీరంలోని అత్యంత ప్రధానమైన అవయవాలలో ఒకటి మెదడు ఎంత ముఖ్యమైన మెదడుని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ఎప్పుడైనా అనుకున్నారా..?

మనం నిత్యజీవితంలో ఎన్నో కూరగాయలు తింటూ ఉంటాం. కానీ మనకే తెలియకుండా కూరగాయల్లోని కొన్ని రకాల భాగాలను పడేస్తూ ఉంటాం. అలాగ వృధాగా పడేసి వాటిలో మెదడుకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రెయిన్ ఆరోగ్యం కోసం ఎక్కువ డబ్బుతో ఖరీదైన ఆహారాన్ని కొనుగోలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. వృధాగా పడేసే కూరగాయల భాగాలతో కూడా మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం.

గుమ్మడి గింజలు ఈ గింజలు వీటిలోని పోషకాలు వాటి పనితీరుని మెరుగుపరుస్తాయి.అంతేకాకుండా గుమ్మడి గింజలలో కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మెదడు పనితీరులు ఇవి అన్ని కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెదడుతో పాటు గుమ్మడి గింజలు గుండెను ఆరోగ్యం ఉంచడంలో ఉపయోగపడతాయి. షుగర్ లెవెల్స్ కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. గుమ్మడి గింజలు మెదడుకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం అధికంగా ఉన్న గుమ్మడి గింజలు నరాల వ్యవస్థ పనితీరు మెరుగుపడడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి..

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది