Brisk Walking : మన దేశంలో గుండె సమస్యల సంఖ్య నానాటికి బాగా పెరుగుతుంది. అలాగే చాలా మంది చిన్నవయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. దీనికి ముఖ్య కారణం ఒత్తిడితో కూడిన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లు. అంతేకాక వేయించినటువంటి ఆహారం అధికంగా తినడం మరియు వ్యాయామం చేయకపోవడం, పొగ తాగడం లాంటి చెడు అలవాట్లు కారణం చేత ఈ సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఇటువంటి జీవనశైలి నుండి బయటపడడానికి పచ్చి కూరగాయలు మరియు పండ్లను తీసుకుంటూ, కొంత టైం పాటు శారీరక శ్రమ చేయడం వలన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే రోజు కేవలం రెండు కిలోమీటర్లు నడవడం వలన శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయి. అలాగే కార్డియాక్ పేషెంట్లు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ తరహా వాకింగ్ చేయాలి. అలాగే రోజుకు రెండు కిలోమీటర్లు నడవడం వలన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
బ్రిస్క్ వాకింగ్ అంటే ఏమిటి : ఈ తరహా నడకలో మనం సాధారణ నడక కంటే కొంచెం వేగంగా నడవాల్సి ఉంటుంది. కానీ పరిగెత్తకూడదు. దీనిలో ఒక వ్యక్తి గంటలో మూడు మైళ్ళు లేక నిమిషానికి 100 అడుగులు వేయాలి. ఈ టైంలో హృదయ స్పందన నిమిషానికి 110 నుండి 120 ఫీట్లకు చేరుతుంది…
-గుండె మరియు ఊపితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-రోజు బ్రీస్క్ వాక్ చేయటం వలన గుండెకు సంబంధించిన సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలుగుతుంది.
– ఇలా నడవడం వలన రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇది రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాక ఎంతో చురికైనా నడకను అనుసరించడం వలన మనం గుండె సమస్యల ప్రమాదాలను తగ్గించుకోవచ్చు
– ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామంది కీళ్ల నొప్పులు లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది పెరిగిన యూరిక్ యాసిడ్ లేక ఆర్థరైటిస్ తో సహా ఇతర సమస్యల వలన కూడా సంభవిస్తుంది. కావున ఈ సమస్య నుండి ఉపశమనం పొందాలి అంటే రోజు బీస్క్ వాక్ చేస్తే మంచిది.
– వారానికి ఐదుసార్లు లేక 30 నిమిషాలు బీస్క్ వాక్ చేస్తే బరువు కూడా అదుపులో ఉంటుంది. ఇలా నడవడం వలన ఎక్కువ కేలరీలు అనేవి ఖర్చు అవుతాయి. కావున మీరు బరువును తగ్గించుకోవచ్చు.
బ్రిస్క్ వాక్ మొదలుపెట్టే ముందు మీరు ధరించే బూట్లు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే సరైనవి వేసుకోకపోవడం వలన ప్రయోజనం కంటే ఎక్కువ హాని కలుగుతుంది. అందుకే పాదరక్షణ ఎంపిక చాలా అవసరం. లేకుంటే రోజంతా అలసట లేక కాళ్ళు నొప్పులు వస్తాయి. ప్రస్తుత కాలంలో వాయు కాలుష్యం అనేది బాగా పెరిగిపోయింది. కావున శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి భద్రత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. అలాగే మీరు బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరించటం అసలు మర్చిపోవద్దు. అంతేకాక ఇది గుండె సంబంధించిన సమస్యలను ఎక్కువ తీవ్రం చేస్తుంది. అలాగే కొందరు ఎక్కువ ప్రయోజనాలు పొందేందుకు వాకింగ్ చేసేటప్పుడు శరీరంపై ఎక్కువగా ఒత్తిడిని కలిగిస్తూ ఉంటారు. కానీ అది చాలా వరకు తప్పు. మీ శరీరానికి విశ్రాంతి అవసరమైనప్పుడు అతిగా శ్రమించటం అంత మంచిది కాదు
Us Elections 2024 : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.…
Virat Kohli Birthday : టీమిండియా Team India మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ …
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే 60 రోజులకి పైగా పూర్తి…
Vangalapudi Anitha : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చాలా కూల్‌గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజాగా…
Fingers : చాలా మంది చేతి వేళ్లను అప్పుడప్పుడు ఇరుస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఇలా చేతి వేళ్లను…
Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య…
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
This website uses cookies.