
Anasuya : అబ్బో అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అదరహో..!
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహిళలపై చేసే వ్యాఖ్యలు, వారి స్వేచ్ఛను పరిమితం చేసే మాటలు వస్తే గట్టిగా ఎదురు నిలబడే వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, వ్యక్తిగత ఎంపికల విషయంలో ఫెమినిస్ట్ దృక్పథంతో మాట్లాడే అనసూయ, ఇటీవల అదే ధైర్యాన్ని చూపించింది. నటుడు శివాజీ మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అనసూయ, మహిళలు ఎలా ఉండాలి, ఎలా దుస్తులు ధరించాలి అనే విషయంలో ఎవరూ తీర్పు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
Anasuya : అబ్బో అనసూయలో ఈ టాలెంట్ కూడా ఉందా.. టాలెంట్ అదరహో..!
శివాజీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్టే, తాను కూడా మర్యాదగా, శాంతియుతంగా తన అభిప్రాయాన్ని వెల్లడించానని ఆమె చెప్పింది. అయితే ఈ వ్యవహారం క్రమంగా శివాజీ–అనసూయ మధ్య మాటల యుద్ధంగా మారి, సోషల్ మీడియా రెండు వర్గాలుగా చీలిపోయింది.అనసూయకు మద్దతుగా నిలిచినవారు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టగా, ఆయనకు అనుకూలంగా ఉన్నవారు అనసూయ గతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆమె యాంకర్‌గా చేసిన షోలు, గ్లామర్ ప్రదర్శన, డబుల్ మీనింగ్ డైలాగ్స్, బికినీ ఫోటోలు అంటూ పాత వీడియోలు, చిత్రాలను షేర్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విమర్శలు కేవలం అనసూయకే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల వరకూ వెళ్లడం మరింత వివాదాస్పదంగా మారింది.
ఇంతకుమించి కొందరు నెటిజన్లు, “శివాజీ హీరోయిన్ల గురించి మాట్లాడితే నువ్వెందుకు స్పందిస్తున్నావు? నువ్వు ఎప్పటి నుంచి హీరోయిన్ అయ్యావు?” అంటూ ఎద్దేవా చేశారు. తాను కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసినట్టు అనసూయ చెప్పినా, ట్రోలింగ్ ఆగకుండా “ఏ సినిమాలో హీరోయిన్‌గా నటించావో చెప్పు” అంటూ మరింత రెచ్చగొట్టారు.ఈ విమర్శలకు ఈసారి అనసూయ భిన్నమైన రీతిలో కౌంటర్ ఇచ్చింది. ‘హీరోయిన్’ అనే పదానికి అర్థం ఏమిటో డిక్షనరీ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ, హీరోయిన్ అంటే కేవలం కథానాయిక మాత్రమే కాదని, ధైర్యం ఉన్న స్త్రీ అనే అర్థం కూడా ఉందని గుర్తు చేసింది. ఇక ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో అనసూయకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో అనసూయ గిటార్ వాయిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. అనసూయని ఇలా చూసి మీలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది వేతన జీవులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. పిఎఫ్ ఖాతాల్లో…
No Cost EMI : ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో మనకు తరచుగా వినిపించే ఆకర్షణీయమైన పదం 'నో కాస్ట్ ఇఎంఐ'…
This website uses cookies.