Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు... జాగ్రత్త సుమీ...!
Panipuri : పానీపూరి ఇష్టం లేనివారు అంటే ఎవరు ఉండరు. పానీపూరి నీ ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. చిన్న నుండి పెద్దదాకా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టపడతారు. పానీ పూరి ఎంత కారంగా ఉన్న కంట్లో నుండి నీళ్లు వస్తున్నా ఒకటి తర్వాత ఒకటి వేగంగా తింటూనే ఉంటారు. కొంతమంది అయితే పానీపూరిని రోజువారి ఆహారంలాగా తీసుకుంటారు. అయితే పానీ పూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందంట. మరి ఇంతలా ఇష్టపడే పానీపూరి బండి మంచి ప్లేస్ లో పెడతారు అంటే అది లేదు. ఒక కాలువ దగ్గర లేదా మురికి కాలువ దగ్గర రోడ్డు మీద ఈ బండిని పెడతారు. రోడ్డు మీద పడే దుమ్ము ధూళి అంతా ఆ పానీ పూరి మీదే పడుతుంది. అలాగే అనేక సార్లు ఆ బిందెలో చేతులను ముంచి లేపుతాడు.
అవే కాకుండా వాష్ రూమ్ కి వెళ్ళిన అదే చెయ్యి చెమట వచ్చిన అదే చెయ్యిని వాడతారు. మరియు పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా ఆ చెయ్యి తోనే ఇకా పానీపూరి నీళ్లలో ఇ- కొలి సుడోమొనాస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే ఈ పానీ పూరి పై ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాళ్ళు మైక్రోస్కోప్ ద్వారా చూసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయిన కూడా ఈ బ్యాక్టీరియా ఉన్న పానీపూరిని తినడం మాత్రం మానరు.అయితే ఈ పానీ పూరి తిన్న వెంటనే దాని రిజల్ట్ చూపించదు. ఆ రోజు లేదా తర్వాత రోజు దాని ఎఫెక్ట్ ని చూపిస్తుంది. కానీ చాలామంది అది పానీపూరి తినడం వల్ల వచ్చింది అనుకోరు. అయితే పానీ పూరి ఫేవరెట్ అనుకున్న వారికి అదిరిపోయే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.
Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు… జాగ్రత్త సుమీ…!
అందులో క్యాన్సర్ దారి తీసే పదార్థాలు ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో పానీ పూరిని బ్యాన్ చేసె దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే చెన్నై లోను కొన్ని శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది. అక్కడ ఇచ్చే రిపోర్ట్ లో ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా పానీపూరి పై బ్యాన్ విదించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఇకనుండి అయినా పానీపూరికి దూరంగా ఉంటే మంచిదని పలువురు చెబుతున్నారు. అంతలా తినాలి అనిపిస్తే చక్కగా ఇంట్లో చేసుకొని తినడం మంచిది.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.