Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు… జాగ్రత్త సుమీ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు… జాగ్రత్త సుమీ…!

Panipuri : పానీపూరి ఇష్టం లేనివారు అంటే ఎవరు ఉండరు. పానీపూరి నీ ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. చిన్న నుండి పెద్దదాకా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టపడతారు. పానీ పూరి ఎంత కారంగా ఉన్న కంట్లో నుండి నీళ్లు వస్తున్నా ఒకటి తర్వాత ఒకటి వేగంగా తింటూనే ఉంటారు. కొంతమంది అయితే పానీపూరిని రోజువారి ఆహారంలాగా తీసుకుంటారు. అయితే పానీ పూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందంట. మరి ఇంతలా ఇష్టపడే పానీపూరి బండి మంచి ప్లేస్ లో పెడతారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :5 July 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు... జాగ్రత్త సుమీ...!

Panipuri : పానీపూరి ఇష్టం లేనివారు అంటే ఎవరు ఉండరు. పానీపూరి నీ ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. చిన్న నుండి పెద్దదాకా ప్రతి ఒక్కరు పానీపూరిని ఇష్టపడతారు. పానీ పూరి ఎంత కారంగా ఉన్న కంట్లో నుండి నీళ్లు వస్తున్నా ఒకటి తర్వాత ఒకటి వేగంగా తింటూనే ఉంటారు. కొంతమంది అయితే పానీపూరిని రోజువారి ఆహారంలాగా తీసుకుంటారు. అయితే పానీ పూరి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతుందంట. మరి ఇంతలా ఇష్టపడే పానీపూరి బండి మంచి ప్లేస్ లో పెడతారు అంటే అది లేదు. ఒక కాలువ దగ్గర లేదా మురికి కాలువ దగ్గర రోడ్డు మీద ఈ బండిని పెడతారు. రోడ్డు మీద పడే దుమ్ము ధూళి అంతా ఆ పానీ పూరి మీదే పడుతుంది. అలాగే అనేక సార్లు ఆ బిందెలో చేతులను ముంచి లేపుతాడు.

అవే కాకుండా వాష్ రూమ్ కి వెళ్ళిన అదే చెయ్యి చెమట వచ్చిన అదే చెయ్యిని వాడతారు. మరియు పానీపూరి బండిని శుభ్రం చేసేది కూడా ఆ చెయ్యి తోనే ఇకా పానీపూరి నీళ్లలో ఇ- కొలి సుడోమొనాస్ వంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే ఈ పానీ పూరి పై ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాళ్ళు మైక్రోస్కోప్ ద్వారా చూసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయిన కూడా ఈ బ్యాక్టీరియా ఉన్న పానీపూరిని తినడం మాత్రం మానరు.అయితే ఈ పానీ పూరి తిన్న వెంటనే దాని రిజల్ట్ చూపించదు. ఆ రోజు లేదా తర్వాత రోజు దాని ఎఫెక్ట్ ని చూపిస్తుంది. కానీ చాలామంది అది పానీపూరి తినడం వల్ల వచ్చింది అనుకోరు. అయితే పానీ పూరి ఫేవరెట్ అనుకున్న వారికి అదిరిపోయే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Panipuri పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు జాగ్రత్త సుమీ

Panipuri : పానీ పూరిలో క్యాన్సర్ కారకాలు… జాగ్రత్త సుమీ…!

అందులో క్యాన్సర్ దారి తీసే పదార్థాలు ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో పానీ పూరిని బ్యాన్ చేసె దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అలాగే చెన్నై లోను కొన్ని శాంపిల్స్ ను తీసుకోవడం జరిగింది. అక్కడ ఇచ్చే రిపోర్ట్ లో ఆధారంగా తమిళనాడు గవర్నమెంట్ కూడా పానీపూరి పై బ్యాన్ విదించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఇకనుండి అయినా పానీపూరికి దూరంగా ఉంటే మంచిదని పలువురు చెబుతున్నారు. అంతలా తినాలి అనిపిస్తే చక్కగా ఇంట్లో చేసుకొని తినడం మంచిది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది