Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి... గుండెపోటు సమస్య ఉండదు...!
Oil : మన భారతదేశంలో ఎంతో మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే. ప్రస్తుతం ఆయిల్ ఫుడ్ తినే అలవాటు చాలా ఎక్కువ. మన ఇళ్లల్లో మరియు బయట ఫుడ్ మార్కెట్ లలో వాడే ఎన్నో రకాల వంట నూనెలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరెందుకు దారితీస్తుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెపోటు,మధుమేహం లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని తగ్గించుకోవడానికి సరైన నూనె ఎంచుకోవడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే మనం మనకి అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను వాడినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఎంతో తీవ్రమైన వ్యాధి ప్రభావాలను పెంచుతుంది. అందుకే మన శరీరానికి మరియు ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
చెడు కొలెస్ట్రాల్ వలన శరీరానికి ప్రమాదం : మీరు నూనె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీ శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు అది రక్తంలోని ఇతర పదార్థాలతో కలుస్తుంది. దీని వలన ధమనులకు అంటుకొని ఫలకం ఏర్పడటం మొదలవుతుంది. అయితే మన ధమానులలో ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది పేరుకు పోయినప్పుడు రక్తనాళాలు అనేవి అడ్డుకోవటం మొదలవుతుంది. దీని వలన రక్తాన్ని గుండెకు అందించటం కష్టం అవుతుంది. అయితే రక్తప్రసరణలో ఒత్తిడి అనేది ఏర్పడినప్పుడు అది రక్త పోటుకు గురికావడం సహజం. ఇది గుండెపోటుతో సహా ఎన్నో రకాల తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది…
Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి… గుండెపోటు సమస్య ఉండదు…!
మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ నూనెను వాడండి : నిజానికి మార్కెట్లో దొరికే వంట నూనెలో వాటి నాణ్యత ప్రమాణాలను చూసిన తర్వాతే తీసుకోవాలి. అయితే పోషకాహార నిపుణుల చెప్పిన దాని ప్రకారం చూస్తే, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు అవిసె గింజల నూనె ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. దీనిని సలాడ్ తో కూడా తినవచ్చు. ఈ నూనెను కొద్దిగా వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. నిజానికి అవిసె గింజల నుండి లీన్సీడ్ నూనెను తీస్తారు. ఇది కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం అని చెప్పొచ్చు. అలాగే ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటాయి. ఈ నూనె అనేది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇతర వంటల నూనె కంటే అవిసె గింజల నుండి తీసినటువంటి నూనెను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.