Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి… గుండెపోటు సమస్య ఉండదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి… గుండెపోటు సమస్య ఉండదు…!

Oil : మన భారతదేశంలో ఎంతో మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే. ప్రస్తుతం ఆయిల్ ఫుడ్ తినే అలవాటు చాలా ఎక్కువ. మన ఇళ్లల్లో మరియు బయట ఫుడ్ మార్కెట్ లలో వాడే ఎన్నో రకాల వంట నూనెలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరెందుకు దారితీస్తుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెపోటు,మధుమేహం లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని తగ్గించుకోవడానికి సరైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి... గుండెపోటు సమస్య ఉండదు...!

Oil : మన భారతదేశంలో ఎంతో మంది ప్రజలు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే. ప్రస్తుతం ఆయిల్ ఫుడ్ తినే అలవాటు చాలా ఎక్కువ. మన ఇళ్లల్లో మరియు బయట ఫుడ్ మార్కెట్ లలో వాడే ఎన్నో రకాల వంట నూనెలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరెందుకు దారితీస్తుంది. అయితే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగటం వలన గుండెపోటు,మధుమేహం లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే దీనిని తగ్గించుకోవడానికి సరైన నూనె ఎంచుకోవడం చాలా అవసరం. నిజం చెప్పాలంటే మనం మనకి అవసరమైన దానికంటే ఎక్కువ నూనెను వాడినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది ఎంతో తీవ్రమైన వ్యాధి ప్రభావాలను పెంచుతుంది. అందుకే మన శరీరానికి మరియు ఆరోగ్యానికి ఏ నూనె మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

చెడు కొలెస్ట్రాల్ వలన శరీరానికి ప్రమాదం : మీరు నూనె అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నట్లయితే చెడు కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మీ శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు అది రక్తంలోని ఇతర పదార్థాలతో కలుస్తుంది. దీని వలన ధమనులకు అంటుకొని ఫలకం ఏర్పడటం మొదలవుతుంది. అయితే మన ధమానులలో ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది పేరుకు పోయినప్పుడు రక్తనాళాలు అనేవి అడ్డుకోవటం మొదలవుతుంది. దీని వలన రక్తాన్ని గుండెకు అందించటం కష్టం అవుతుంది. అయితే రక్తప్రసరణలో ఒత్తిడి అనేది ఏర్పడినప్పుడు అది రక్త పోటుకు గురికావడం సహజం. ఇది గుండెపోటుతో సహా ఎన్నో రకాల తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది…

Oil ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి గుండెపోటు సమస్య ఉండదు

Oil : ఈ నూనె తో కొవ్వుకు చెక్ పెట్టండి… గుండెపోటు సమస్య ఉండదు…!

మీకు అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే ఈ నూనెను వాడండి : నిజానికి మార్కెట్లో దొరికే వంట నూనెలో వాటి నాణ్యత ప్రమాణాలను చూసిన తర్వాతే తీసుకోవాలి. అయితే పోషకాహార నిపుణుల చెప్పిన దాని ప్రకారం చూస్తే, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు అవిసె గింజల నూనె ను తీసుకుంటే ఎంతో మేలు చేస్తుంది. దీనిని సలాడ్ తో కూడా తినవచ్చు. ఈ నూనెను కొద్దిగా వేడి చేసుకుని కూడా తీసుకోవచ్చు. నిజానికి అవిసె గింజల నుండి లీన్సీడ్ నూనెను తీస్తారు. ఇది కొవ్వు ఆమ్లాలకు గొప్ప మూలం అని చెప్పొచ్చు. అలాగే ఒలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటాయి. ఈ నూనె అనేది చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇతర వంటల నూనె కంటే అవిసె గింజల నుండి తీసినటువంటి నూనెను తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది