Tea : టీ ‘లో ప్రమాదకర రసాయనాలు… దీంతో క్యాన్సర్ ప్రమాదాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea  : టీ ‘లో ప్రమాదకర రసాయనాలు… దీంతో క్యాన్సర్ ప్రమాదాలు…

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea  : టీ 'లో ప్రమాదకర రసాయనాలు... దీంతో క్యాన్సర్ ప్రమాదాలు...

Tea  : ప్రస్తుత కాలంలో ఎంతోమందికి టీ తాగనేది రోజు గడవదు. అయితే ఉదయమైనా, పగలైనా, సాయంత్రమైనా, రాత్రయిన మరియు చిరాగ్గా ఉన్నప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. మనం ఉదయం నిద్ర లేవగానే మన పని మొదలు అవ్వాలన్నా మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీ మాత్రమే.ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో టీ అనేది ఎన్నో విధాలుగా ముడిపడి ఉంది అని చెప్పొచ్చు. అందుకే ఎన్నో ఇండ్లలో టీ లేనిదే ఇంట్లో రోజు గడవదు. కొంతమంది మాత్రం రోజంతా టీ తాగకుండా కూడా ఉంటారు.అయితే టీ కి మరియు క్యాన్సర్ కి మధ్య సంబంధం ఉంది తెలుసా. అయితే ఈ టీ ని చాలా చోట్ల తయారు చేసేటప్పుడు కలర్లను మిక్స్ చేస్తారు.ఇది క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది.ఇలాంటి సంఘటనే ప్రస్తుతం కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎంతో విషపూరితమైన పద్ధతులను వాడి టీ ఉత్పత్తి చేస్తున్నట్లుగా కనుక్కున్నారు…

కర్ణాటకలో ఎన్నోచోట్ల టీ కి సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్లో టెస్టులు చేయించగా దీనిలో 71 శాతం శాంపిల్స్ లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని తేలింది. అదే రాష్ట్రంలో కాలీఫ్లవర్, మంచూరియన్, పీచ్ మిఠాయి లాంటి వాటిలలో వాడే రంగుల మీద కూడా FSSAI షాకింగ్ విషయాలను తెలిపింది. ఈ రంగులు అనేవి ఎంతో విషంతో కూడుకున్నవి. వీటి వలన క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది. కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రస్తుతం ఒక కారులో దొరికినటువంటి టీ ఆకుల నమూనాలను సేకరించాడు. వాటన్నిటిని తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయగా వాటిలో దుమ్ము, పురుగు మందులు, రంగులు ఉన్నట్లుగా కనుక్కున్నారు.ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అయితే ఉత్తర కర్ణాటక నుండి సుమారుగా 50 శాంపిల్స్ తీసుకోగా ఈ టీ ఆకుల తయారులో ఎక్కువ మొత్తంలో పురుగుమందును ఉపయోగించినట్లుగా తేలింది అని తెలిపారు. అయితే ఈ క్యాన్సర్ ప్రమాదాలను పెంచే రోడమైన్ బి, టార్ట్రాజేన్ లాంటి ఎన్నో రసాయనాలు ఈ తేయాకు ఉత్పత్తిలో వాడుతున్నట్లుగా తేలింది. ఇది ఎంతో ప్రమాదకరమైన సంకేతం…

Tea టీ'లో ప్రమాదకర రసాయనాలు... దీంతో క్యాన్సర్ ప్రమాదాలు...

Tea  : టీ ‘లో ప్రమాదకర రసాయనాలు… దీంతో క్యాన్సర్ ప్రమాదాలు…

నిపుణులు ఏమంటున్నారు : టీ చేస్తున్న టైంలో రోడమైన్ బి, కార్మోషన్ ఫుడ్ కలర్స్ ను కలుపుతున్నారని ఢిల్లీలో ఉన్న ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అంగ్స్ మన్ తెలిపారు. అయితే ఈ రకమైన టీ ని తీసుకోవడం వలన శరీరంలో వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అయితే దీనిని దీర్ఘకాలం వాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే ఈ రోడమైన్ బి అనేది క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనం. అయితే ఎంతో మంది పాలతో చేసిన టీ తాగటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. కానీ ప్రతినిత్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. అయితే పరిగడుపున పాలతో చేసిన టీని తాగటం వలన జీవక్రియ అనేది బలహీన పడుతుంది. దీనిని దీర్ఘకాలం పాటు తీసుకోవడం వలన ఉబ్బరం, ఎసిడిటీ కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.అలాగే ఈ టీలో కెఫిన్ అనేది ఉంటుంది. దీనిని తీసుకోవటం వలన రాత్రి టైమ్ లో నిద్రవ్యవస్థను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే ఈ టీని ఎక్కువగా తీసుకోవటం వలన నిద్రలేని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది