Health Benefits : ఈ మధ్య చాలా మందిలో మొకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని బాధ పెడుతున్నాయి. నిద్రలేమి కూడా అతిపెద్ద సమస్యగా తయారైంది. చాలా మంది సరిగ్గా నిద్ర లేక సతమతం అవుతున్నారు. చాలా మందిలో నొప్పులు రావడానికి కారణం కాల్షియం లోపించడమే. కాళ్లు, నడుము నొప్పి, నిద్రలేమి, అలసట, నీరసం లాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే.. ఈ ఒక్క చిట్కా పాటించి చూడండి. తక్కువ కాలంలోనే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కేవలం వారానికి మూడు సార్లు తీసుకుంటే చాలు నడుము నొప్పి, కాళ్లు నొప్పి, మోకాళ్ళ నొప్పి మీ శరీరంలో ఎటువంటి జాయింట్ పెయిన్ అయినా తగ్గుతుంది.ప్రస్తుత కాలంలో ఏ వయస్సు వారైనా కీలు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.
దీనికి కారణం మన శరీరంలో కాల్షియం లోపం. ఇలాంటి వాటికి ఈ ఆయుర్వేత రెమెడీ ఎంతో చక్కగా పని చేస్తుంది. దీని కోసం ముందుగా గసగసాలు కావాల్సి ఉంటుంది. గసగసాలను ఉపయోగించి ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ముఖ్యంగా మన శరీరంలోని ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. గసగసాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గసగసాలతో పాటు సోంపును తీసుకోవాలి. సోంపు తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సోంపు ఎంతో చక్కగా పని చేస్తుంది. సోంపును తరచూ తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. మరియు అధిక కొవ్వు ఉన్న వాళ్లకి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరిలో కాల్షియం మరియు అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఎండు కొబ్బరి మంచి శక్తిని ఇస్తుంది.
తర్వాత తీసుకోవాల్సిన పదార్థం పటిక బెల్లం. పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో పటిక బెల్లం చక్కగా పని చేస్తుంది. ఇంకా శరీరాన్ని చల్ల పరుస్తుంది కూడా. పటిక బెల్లాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రెమిడినీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్‌పై ఒక కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నెయ్యి ను వేడి చేసి అందులో రెండు స్పూన్ల గసగసాలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను వేసి మరగనివ్వాలి. అందులో ఒక అంగుళం ఎండు కొబ్బరిని వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి ఒక పొంగు వచ్చాక పటిక బెల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ పాలను రోజు తప్పించి రోజు వారానికి 3 సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం నుండి బయట పడవచ్చు. మరియు వెన్నునొప్పి కాళ్ల నొప్పి నడుము నొప్పులు తగ్గుతాయి.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.