Health Benefits : కాల్షియం లోపం ఉందా.. ఈ ఒక్కటి తీసుకోండి చాలు ఎంతో ప్రయోజనం! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : కాల్షియం లోపం ఉందా.. ఈ ఒక్కటి తీసుకోండి చాలు ఎంతో ప్రయోజనం!

 Authored By pavan | The Telugu News | Updated on :11 May 2022,5:00 pm

Health Benefits : ఈ మధ్య చాలా మందిలో మొకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని బాధ పెడుతున్నాయి. నిద్రలేమి కూడా అతిపెద్ద సమస్యగా తయారైంది. చాలా మంది సరిగ్గా నిద్ర లేక సతమతం అవుతున్నారు. చాలా మందిలో నొప్పులు రావడానికి కారణం కాల్షియం లోపించడమే. కాళ్లు, నడుము నొప్పి, నిద్రలేమి, అలసట, నీరసం లాంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవాలంటే.. ఈ ఒక్క చిట్కా పాటించి చూడండి. తక్కువ కాలంలోనే మంచి ప్రయోజనం కనిపిస్తుంది. కేవలం వారానికి మూడు సార్లు తీసుకుంటే చాలు నడుము నొప్పి, కాళ్లు నొప్పి, మోకాళ్ళ నొప్పి మీ శరీరంలో ఎటువంటి జాయింట్ పెయిన్ అయినా తగ్గుతుంది.ప్రస్తుత కాలంలో ఏ వయస్సు వారైనా కీలు, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.

దీనికి కారణం మన శరీరంలో కాల్షియం లోపం. ఇలాంటి వాటికి ఈ ఆయుర్వేత రెమెడీ ఎంతో చక్కగా పని చేస్తుంది. దీని కోసం ముందుగా గసగసాలు కావాల్సి ఉంటుంది. గసగసాలను ఉపయోగించి ఏ వంటకం చేసినా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ముఖ్యంగా మన శరీరంలోని ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. గసగసాల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. గసగసాలతో పాటు సోంపును తీసుకోవాలి. సోంపు తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సోంపు ఎంతో చక్కగా పని చేస్తుంది. సోంపును తరచూ తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది. మరియు అధిక కొవ్వు ఉన్న వాళ్లకి కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వీటితో పాటు ఎండు కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరిలో కాల్షియం మరియు అనేక పోషకాలు ఉంటాయి. అలాగే ఎండు కొబ్బరి మంచి శక్తిని ఇస్తుంది.

do you have lack of calcium in your body try this remedy

do you have lack of calcium in your body try this remedy

తర్వాత తీసుకోవాల్సిన పదార్థం పటిక బెల్లం. పటిక బెల్లం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో పటిక బెల్లం చక్కగా పని చేస్తుంది. ఇంకా శరీరాన్ని చల్ల పరుస్తుంది కూడా. పటిక బెల్లాన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ రెమిడినీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్‌పై ఒక కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నెయ్యి ను వేడి చేసి అందులో రెండు స్పూన్ల గసగసాలు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను వేసి మరగనివ్వాలి. అందులో ఒక అంగుళం ఎండు కొబ్బరిని వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి ఒక పొంగు వచ్చాక పటిక బెల్లం వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఈ పాలను రోజు తప్పించి రోజు వారానికి 3 సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం నుండి బయట పడవచ్చు. మరియు వెన్నునొప్పి కాళ్ల నొప్పి నడుము నొప్పులు తగ్గుతాయి.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది