Body Donation : దాధీచి ఋషి గురించి మీకు తెలుసా… శరీర అవయవ దానం ఎలా చేయాలి… దీని నియమాలు ఏమిటి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Body Donation : దాధీచి ఋషి గురించి మీకు తెలుసా… శరీర అవయవ దానం ఎలా చేయాలి… దీని నియమాలు ఏమిటి…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Body Donation : దాధీచి ఋషి గురించి మీకు తెలుసా... శరీర అవయవ దానం ఎలా చేయాలి...దీని నియమాలు ఏమిటి...?

Body Donation : సాధారణంగా దానాలలో కెల్లా గొప్పదైన దానం అన్నదానం అని అంటారు. అలాగే అవయవ దానం కూడా గొప్పదే. స్నానం చేయడం అత్యుత్తమ కర్మ అని హిందువులకు నమ్మకం. హిందూ ధర్మ శాస్త్రాలలో దానానికి విశిష్టమైన ప్రాముఖ్యత,మంచి స్థానం ఉంది. అయితే,మనుషులు చేసే కర్మల్లో దానం ఒక ముఖ్యమైన భాగంగా చేయబడింది. అన్నదానం, వస్త్ర దానం,  దానం,గోదానం, అనే రక రకాల దానాలు ఉన్నాయి. అలాగే శరీర దానానికి కూడా శరీర అవయవ దానానికి విశిష్ట స్థానం ఉందని మీకు తెలుసా… కాలాలలో శరీరాన్ని దానం చేసినా ఋషి నుంచి నేటి ఆధునిక యుగంలో కూడా శరీర దానం విశిష్టతను తెలియజేస్తూనే ఉన్నాయి. దానం చేస్తే ఆత్మశుద్ధి అవుతుంది. కర్మణి సంపాదించడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి కూడా ఒక గొప్ప మార్గం అని నమ్మకం. దానాల ప్రకారం పావురాన్ని రక్షించేందుకు, శరీరం మాంసం కోసి డేగకు ఇచ్చిన “శిబి చక్రవర్తి “మాత్రమే కాదు. ఇంద్రుడికి రాక్షస వధ కోసం, ఇంద్రుని వజ్రాయుధంగా మారెందుకు దతిచి అనే ఋషి తన శరీరాన్ని దానం చేసి,నేటికీ చరిత్రలో గొప్ప వ్యక్తులుగా నిలిచిపోయారు.ఇలాంటివారు శరీర దానానికి ఉన్న సాంస్కృతిక ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.

Body Donation దాధీచి ఋషి గురించి మీకు తెలుసా శరీర అవయవ దానం ఎలా చేయాలి దీని నియమాలు ఏమిటి

Body Donation : దాధీచి ఋషి గురించి మీకు తెలుసా… శరీర అవయవ దానం ఎలా చేయాలి… దీని నియమాలు ఏమిటి…?

Body Donation శరీర దానం అంటే

శరీర దానం అంటే మరణాంతరం వైద్య కళాశాలలో లేదా పరిశోధన సంస్థలకు మొత్తం శరీరాన్ని దానం చేయడం అని అర్థం. ఇందులో అవయవ దానం అంటే కళ్ళు, కాలేయం,గుండె,కిడ్నీలు అంటే అవయవాలను దానం చేయడమే కాదు.శరీర నిర్మాణ అధ్యయనాల కోసం మొత్తం శరీరాన్ని కూడా దానం చేయవచ్చు.అయితే,ప్రస్తుత కాలంలో శరీర దానం అంటే ఏమిటి? ఏం చేయాలి? ఎలాంటి శరీరాన్ని వైద్యులు తీసుకుంటారో తెలుసుకుందాం…

వైద్య విద్య : వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణ శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి మానవ మృతదేహాలు అవసరం. ఈ నైపుణ్యం కలిగిన వైద్యులను తయారుచేసే సమాజానికి అందించడం సహాయపడుతుంది.

పరిశోధన : అంతే కాదు, కొత్త చికిత్సలు వ్యాధుల నిర్ధారణకు శరీర దానం ముఖ్యమైనది.
సామాజిక సహకారం : శరీర దానం అనేది,ఒక దాతృత్వ చర్య. సమాజం, మానవ జీవన విధానం,విజ్ఞాన శాస్త్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

Body Donation  శరీర దాన ప్రక్రియ అంటే ఏమిటి.? ఎలా చేయాలి

రిజిస్ట్రేషన్ : ఎవరైనా చనిపోయే ముందు తన శరీర అవయవాలను దానం చేయాలి అనుకుంటే.. ముందు ఆ స్థానిక మెడికల్ కాలేజీ లను ఆసుపత్రి లేదా దధీచి దేహ దాన్ సమితి వంటి NGO సంస్థలను సంప్రదించాల్సి ఉంటుంది. శరీరాన్ని దానం ఇవ్వాలనుకుంటే వారు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక ప్రతిజ్ఞ ఫారం నింపాలి. ఈ పత్రంలో ఇద్దరూ సాక్షులు,సాక్షులుగా సంతకం పెట్టాలి. ఇద్దరి సభ్యులలో, ఒకరు కుటుంబ సభ్యుల్లో ఒకరు అవ్వాలని నిబంధన తప్పనిసరిగా పాటించాలి.

కుటుంబ సమ్మతి : మరణాంతరం శరీర దానం చేయాలని నిర్ణయం కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఎందుకంటే, మరణాంతరం శరీరం మెడికల్ కాలేజీ వారు మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఎందుకంటే మరణాంతరం శరీర మెడికల్ కాలేజీ వారు మృతదేహాన్ని తీసుకునేందుకు
కుటుంబ సభ్యుల సమితి అవసరం.

మరణం తరువాత : తర్వాత కుటుంబ సభ్యులు సంబంధిత సంస్థను సంప్రదించాలి ఉదాహరణకు దదీచి దేహా దాన్ సమితి ( ఢిల్లీ NCR ) కు, కాల్ చేసి సమాచారం అందించాలి. అంతరము వారు మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అందించే ఏర్పాటు చేస్తారు.
పత్రాలు : మరణ ధ్రువీకరణ పత్రం గుర్తింపు కార్డు అవసరం.

అవయవ దానం : అవయవాలను దానం చేయాలనుకుంటే మరణించిన వెంటనే, అంటే కొన్ని గంటల్లోపు ఆ ప్రక్రియను నిర్వహించాలి. ముఖ్యంగా, బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన సమయంలో, వెంటనే అవయవ దానం చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది.

Body Donation ఎవరి శరీర దానాన్ని, అవయవ దానాన్ని తిరస్కరిస్తారంటే

.ఎవరైనా కొన్ని రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే,లేదా క్యాన్సర్ వంటి వ్యాధి ఉన్నవారి అవయవాదానాన్ని తిరస్కరించబడుతుంది.
. కొన్ని సంస్థలు పోస్ట్మార్టం అవసరమైన వ్యక్తుల మృతదేహాలను దానంగా అంగీకరించవు.
. వేయవదానం గురించి నిర్ణయించుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించే సమీపంలోని వైద్య సమస్తను సంప్రదించాల్సి ఉంటుంది.అప్పుడు,మరణం తర్వాత ఆ మృతదేహాన్ని పరిశోధన నిమిత్తం తీసుకొని వెళ్లే ప్రక్రియ సులభతరం అవుతుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది