Bacteria : మనిషి తినే బ్యాక్టీరియాఇది చాలా డేంజరస్. 48 గంటల్లోనే మరణం ఖాయం. అవును. మనిషిని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా ప్రస్తుతం జపాన్ లో వ్యాపిస్తూ ఉన్నది. ఈ వ్యాధి అనేది నగరాలలో ఎంతో వేగంగా విస్తరించటం వలన జపాన్ ఎంతో షాక్ అవుతుంది. ఇంతకీ అసలు మనిషిని తినే బ్యాక్టీరియా ఏంటి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. రెండు రోజులలో మనిషిని చంపే డేంజరస్ బ్యాక్టీరియా అనేది ఇప్పుడు జపాన్ లో వేగంగా వ్యాపిస్తూ ఉంది. మనిషి మాంసాన్ని తినే ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా జపాన్ లోని టోక్యోలో ఎంతో వేగంగా విజృంభిస్తూ ఉంది. స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బ్యాక్టీరియా ఇది. కరోనా కంటే డేంజరస్ గా ఉన్నది. ప్రస్తుతం ఈ బ్యాక్టీరియా దెబ్బకు జపాన్ అనేది వణుకుతుంది. మనిషి మాంసాన్ని తిని బ్రతికే ఈ బ్యాక్టీరియా కేసులు జపాన్ లో రోజు రోజుకు ఎంతగానో పెరుగుతూ ఉన్నాయి. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ ప్రకారం చూసినట్లయితే, జూన్ రెండు నాటికి 977 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ బ్యాక్టీరియా కేసులు అనేవి గత ఏడాది మొత్తం 941 నమోదు కాగా, ఈ ఏడాది మాత్రం ఇప్పటికే 977 కేసులు దాటడం వలన మరింత భయందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ప్రథమార్థంలో టోక్య లోని 145 కేసులు నమోదు అయినట్లుగా స్థానిక మీడియా తెలిపింది.
ఇక ఈ వ్యాధి లక్షణాలను పరిశీలించినట్లయితే సాధారణంగా గొంతు నొప్పి మరియు వాపు లాంటి తేలిక పాటి అనారోగ్య లక్షణాలతో ప్రారంభం అవుతుంది. కానీ ప్రతిరోజు క్రమంగా శరీరంలోని అవయవాలను నొప్పి, వాపు జ్వరం, లోబీపీ,శరీర కణజాలాన్ని చంపి నెక్రోసిన్ లాంటి తీవ్రమైన లక్షణాలు కలిగి ఉన్నది. ఈ వ్యాధి అనేది వ్యాపించి తరువాత అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి కూడా దారి తీస్తున్నాయి. ఈ వ్యాధి కేసుల 30 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా నమోదవుతుండటం వలన 50 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం ప్రమాదకరంగా మారింది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే జరుగుతూ ఉన్నట్లుగా జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒక రోజు ఉదయం పాదంలో వాపు గమనిస్తే మధ్యాహ్ననానికి మోకాలి వరకు వ్యాపిస్తూ ఉన్నది. దాని తర్వాత 48 గంటల లోపే మరణిస్తున్నారని టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కెన్ కి కూచి తెలిపారు. ఈ లెక్కన STSS బ్యాక్టీరియా ఎంత ప్రమాదమో తెలుస్తూ ఉన్నది కదా. ఈ బ్యాక్టీరియా వ్యాధి మరణాల రేటు 30% ఉండటం ప్రమాదకరం అని హెచ్చరించారు. ప్రొఫెసర్ కెన్ కి కూచి.
రోగుల పేగుల్లో జీవనం మలం ద్వారా కలుషితం : ఈ బ్యాక్టీరియా అనేది ఎంతో ప్రాణాంతకమైనది. ఇది రోగుల పేగులలో జీవిస్తూ ఉంది. మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుంది అన్నారు ప్రొఫెసర్ కెన్ కికూచి. ఈ తరుణంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలాగే ఒంటిపై గాయాలు ఉన్నవారు కూడా వెంటనే చికిత్స చేయించుకోవాలి అని సూచించారు. ఈ డేంజరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఎంతో అప్రమత్తంగా ఉండాలి అని తెలిపారు. ప్రస్తుతం ఈ పరిస్థితుల ప్రకారం చూస్తే,ఈ సంవత్సరం జపాన్ లో కేసుల సంఖ్య 2500కి చేరుకోవచ్చు అని మరణాల రేటు కూడా భయంకరంగా ఉంది అని ప్రొఫెసర్ కెన్ కికూచి తెలిపారు. మరొక వైపు సుమారు 5 ఐరోపా దేశాలు 2022లో ఈ STSS తో కూడినటువంటి ఇన్వాసిన్వ్ గ్రూప్ A స్ట్రెప్టోకోకస్ వ్యాధి కేసుల పెరుగుదలను గుర్తిస్తున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అందులో కోవిడ్ ఆంక్షలు ముగిసిన తర్వాత ఈ కేసులు పెరిగాయి అని WHO తెలిపింది. మొత్తంగా ఈ మనిషిని తినే బ్యాక్టీరియా జపాన్ లో తీవ్ర కల్లోలం రేపింది. అయితే టోక్యోలో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీ హెచ్చరిక నేపథ్యంలో ఈ వ్యాధి కంట్రోల్ కు జపాన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడాలి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.