Tea Coffee : టీ, కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea Coffee : టీ, కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Tea Coffee : సహజంగా అందరూ ఉదయం లేవగానే టీ ,కాఫీ లను తాగుతూ ఉంటారు. వీటిని తాగకుండా ఉండలేని వారు కూడా చాలామంది ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి కారణంగానే ఈమధ్య కాఫీ టీల వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రారంభించారు ఆరోగ్య నిపుణులు.. చాలామంది చక్కెర, పాలు, కాఫీ పౌడర్ తో టీ కాఫీలు చేసుకుని తాగుతూ ఉంటారు. కొంతమంది కాఫీ టీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Coffee : టీ, కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Tea Coffee : సహజంగా అందరూ ఉదయం లేవగానే టీ ,కాఫీ లను తాగుతూ ఉంటారు. వీటిని తాగకుండా ఉండలేని వారు కూడా చాలామంది ఉంటారు. అయితే వీటి వలన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వీటి కారణంగానే ఈమధ్య కాఫీ టీల వలన కలిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ప్రారంభించారు ఆరోగ్య నిపుణులు.. చాలామంది చక్కెర, పాలు, కాఫీ పౌడర్ తో టీ కాఫీలు చేసుకుని తాగుతూ ఉంటారు. కొంతమంది కాఫీ టీ లేకపోతే వారు ఏ పని మొదలు పెట్టరు.. అయితే వీటి వలన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక నెలపాటు టీ కాఫీ లను తాగడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా.. శరీరంలో కొన్ని మార్పులు వస్తాయట.. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Tea Coffee : అధిక బరువు తగ్గుతారు

30 రోజులు పాటు టీ, కాఫీలను మానేయడం వల్ల బరువు తగ్గొచ్చు. ఇందులో ఉండే చక్కర శరీర బరువును పెంచుతుంది. కెఫెన్ జీవ క్రియను ప్రభావితం చేస్తాయి. అందుకే టీ, కాఫీలు మానేయడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది..

-దంత సమస్య: ఒక 30 రోజులు పాటు టిఫిన్ ఉన్న పానీయాలు తీసుకోకపోవడం వలన దంతాలు కూడా శుభ్రం అవుతాయి. వాస్తవానికి టీ, కాఫీలు కొద్దిగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. వివిధ దంతాల ఎనామిల్ దెబ్బతీస్తాయి. దంతాలలో జలదరింపు తెల్లదనంపై ప్రభావం ఉంటుంది. కాఫీ, టీ మానేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు..

Tea Coffee టీ కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tea Coffee : టీ, కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Tea Coffee : ప్రశాంతమైన నిద్ర

30 రోజులపాటు కాఫీ, టీలను తాగడం మానేస్తే నిద్ర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. గాడమైన నిద్ర వస్తుంది. టీలో కెఫిన్ ఉంటుంది. ఇది మెదడు చురుకుగా ఉంచుతుంది.

ఈ కారణంగా కాఫీ, టీలు తాగుతుంటే నిద్ర సరిగా పట్టదు..

Tea Coffee : షుగర్ లెవెల్స్ కంట్రోల్

ఒక నెల రోజులపాటు టీ మానేస్తే షుగర్ లెవెల్ కంట్రోల్ లో ఉంటుంది. చక్కెర కలిపిన టీ, కాఫీ తీసుకుంటే అధిక రక్తంలో చక్కెరను పెంచే అవకాశం ఉంటుంది. ఇక టీ కాఫీలో ఉండే కేఫిన్ రక్తంలో షుగర్ లెవెల్స్ ని దానికి సంబంధించిన సమస్యలను కూడా అధికమయ్యేలా చేస్తాయి.

Tea Coffee టీ కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tea Coffee : టీ, కాఫీలు 30 రోజులు మానేస్తే ఎలాంటి మార్పులు వస్తాయి తెలుసా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది

టీ తీసుకోవడం వలన కొన్ని నిమిషాల పాటు శరీర అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ టీ రక్తపోటును పెంచుతుంది. టీ కాఫీ లో ఉండే కెఫిన్ అధిక రక్తపోటును పెంచుతుంది. 30రోజుల పాటు టీ లేదా కాఫీ మానేయడం వలన రక్తపోటు కంట్రోల్ అవుతుంది..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది