Tea : చిన్నపిల్లలు టీ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
ప్రధానాంశాలు:
Tea : చిన్నపిల్లలు టీ తాగితే... ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!
Tea : ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఒక్కరికి కూడా టీ తాగనిదే రోజు గడవదు. అయితే ఈ టీ అనేది ఒక ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. ఈ టీ ని తీసుకోవడం వలన చాలా రకాల లాభాలు ఉన్నాయి. అలాగని ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇంట్లో పెద్దవాళ్లు టీ తాగుతున్నప్పుడు పిల్లలు కూడా టీ తాగుతామని మారం చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు ఏడుస్తున్నారు కదా అని పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి టీ పోస్తూ ఉంటారు. కానీ పిల్లలు మాత్రం టీ అస్సలు తాగకూడదు అని అంటున్నారు నిపుణులు…

Tea : చిన్నపిల్లలు టీ తాగితే… ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
పిల్లలు టీ ని ఎక్కువగా తాగడం వలన వారు బద్ధకస్తులుగా మారతారు అని అంటున్నారు. అలాగే ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది అని అంటున్నారు. అంతేకాక మూత్ర విసర్జన సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు. అయితే పది సంవత్సరాల కన్న తక్కువగా ఉండే పిల్లలకు టీ ఇవ్వడం మంచిది కాదు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో వారిలో నిద్ర సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు…
చిన్న పిల్లలు టీ ని తాగడం వలన వారిలో దంత సమస్యలకు కూడా ఎక్కువగా వస్తాయి అని అంటున్నారు. అలాగే పళ్ళు కూడా తొందరగా ఊడిపోతాయి. అలాగే నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అలాగే పిల్లలు టీ తాగటం వలన పిల్లల్లో రక్తహీనత సమస్యలు కూడా వస్తాయట. పిల్లలు టీని తాగడం వలన ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయట. అలాగే తలనొప్పి సమస్య కూడా వస్తుంది. అంతేకాక పిల్లలు టీ తాగడం వలన భోజనం సరిగ్గా చేయరు. అలాగే ఆకలి అనేది చచ్చిపోయి, కాళ్ల నొప్పులు వస్తాయి. కావున చిన్న పిల్లలకు టీ ని అస్సలు ఇవ్వకండి.