Green Tea : పురుషలందు పుణ్య పురుషులు వేరయా అన్నాడో మహాకవి.. అలాగే టీల యందు గ్రీన్ టీ వేరయా అంటున్నారు టీ లవర్స్. ఎందుకంటే గ్రీన్ టీకి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి. దాని వల్ల ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరే ఇతర టీలతో ఉండవు. చాలా మంది బరువు తగ్గడం కోసం గ్రీన్ టీని తాగుతుంటారు. ఇంకొందరు పొట్ట తగ్గించుకోవడం కోసం, మరికొందరు పొట్ట ఆరోగ్యం కోసం గ్రీన్ టీలను తాగుతుంటారు. అయితే చాలా మంది గ్రీన్ టీ తాగిన తర్వాత గ్రీన్ టీ బ్యాగులను బయట పడేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఉంటే వాటితో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
గ్రీన్ టీ బ్యాగులు దుర్వాసనను పోగొట్టడంలో బాగా పని చేస్తాయి. ఏదైనా అల్మారా లేదా మూసివేసిన వస్తువుల నుంచి దుర్వాసనలు వచ్చినప్పుడు.. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను కత్తిరించి ఎండబెట్టుకోవాలి. తర్వాత దాన్ని అందులో ఉంచితే అల్మారా నుంచి ఎలాంటి దుర్వాసనలు రాకుండా ఉంటాయి.గ్రీన్ టీని మీరు కత్తిరించుకుని అందులో ఉండే మసాలా దినుసులను కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే ఆ మసాలా దినుసులను ఎండలో ఆరబెట్టుకోవచ్చు. అయితే ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ మసాలా దినుసులను మట్టి కుండలో బాగా కలిపితే ఎండిపోయిన మొక్కలు కూడా పచ్చగా మారిపోతాయి.
కొన్ని సమయాల్లో ఫ్రిడ్జ్ లో ఏదైనా కూరగాయాలు లేదా తినే ఆహారాలు పాడైపోయినప్పుడు దాని నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి సమయంలో గ్రీన్ టీ బ్యాగులను ఎండబెట్టుకుని అందులో ఉంచుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి వచ్చే దుర్వాసనను ఇది అరికట్టి మంచి స్మెల్ వచ్చేలా చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది నాన్-స్టిక్ పాన్‌ను ఉపయోగిస్తారు. ఇందులో కొందరు నూనెతో వంటలు చేసినప్పుడు ఆ నూనె పెనానికి పట్టుకుని అలాగే ఉంటుంది. అప్పుడు గ్రీన్ టీ దినుసులను ఉపయోగించి ఆ నూనెను పోగొట్టుకోవచ్చు. ఇలా గ్రీన్ టీ బ్యాగులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రయోగాలు స్టార్ట్ చేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.