Green Tea : గ్రీన్ టీ బ్యాగులను వాడేసిన తర్వాత పడేయకండి.. ఇలా చేస్తే ఎన్ని ఉపయోగాలో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Green Tea : గ్రీన్ టీ బ్యాగులను వాడేసిన తర్వాత పడేయకండి.. ఇలా చేస్తే ఎన్ని ఉపయోగాలో..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Green Tea : గ్రీన్ టీ బ్యాగులను వాడేసిన తర్వాత పడేయకండి.. ఇలా చేస్తే ఎన్ని ఉపయోగాలో..!

Green Tea : పురుషలందు పుణ్య పురుషులు వేరయా అన్నాడో మహాకవి.. అలాగే టీల యందు గ్రీన్ టీ వేరయా అంటున్నారు టీ లవర్స్. ఎందుకంటే గ్రీన్ టీకి అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి. దాని వల్ల ఉన్నన్ని ఆరోగ్య ప్రయోజనాలు మరే ఇతర టీలతో ఉండవు. చాలా మంది బరువు తగ్గడం కోసం గ్రీన్ టీని తాగుతుంటారు. ఇంకొందరు పొట్ట తగ్గించుకోవడం కోసం, మరికొందరు పొట్ట ఆరోగ్యం కోసం గ్రీన్ టీలను తాగుతుంటారు. అయితే చాలా మంది గ్రీన్ టీ తాగిన తర్వాత గ్రీన్ టీ బ్యాగులను బయట పడేస్తుంటారు. కానీ అలా చేయకుండా ఉంటే వాటితో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Green Tea : దుర్వాసన రాకుండా..

గ్రీన్ టీ బ్యాగులు దుర్వాసనను పోగొట్టడంలో బాగా పని చేస్తాయి. ఏదైనా అల్మారా లేదా మూసివేసిన వస్తువుల నుంచి దుర్వాసనలు వచ్చినప్పుడు.. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను కత్తిరించి ఎండబెట్టుకోవాలి. తర్వాత దాన్ని అందులో ఉంచితే అల్మారా నుంచి ఎలాంటి దుర్వాసనలు రాకుండా ఉంటాయి.గ్రీన్ టీని మీరు కత్తిరించుకుని అందులో ఉండే మసాలా దినుసులను కూడా వాడుకోవచ్చు. ఎలా అంటే ఆ మసాలా దినుసులను ఎండలో ఆరబెట్టుకోవచ్చు. అయితే ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ మసాలా దినుసులను మట్టి కుండలో బాగా కలిపితే ఎండిపోయిన మొక్కలు కూడా పచ్చగా మారిపోతాయి.

Green Tea గ్రీన్ టీ బ్యాగులను వాడేసిన తర్వాత పడేయకండి ఇలా చేస్తే ఎన్ని ఉపయోగాలో

Green Tea : గ్రీన్ టీ బ్యాగులను వాడేసిన తర్వాత పడేయకండి.. ఇలా చేస్తే ఎన్ని ఉపయోగాలో..!

కొన్ని సమయాల్లో ఫ్రిడ్జ్ లో ఏదైనా కూరగాయాలు లేదా తినే ఆహారాలు పాడైపోయినప్పుడు దాని నుంచి దుర్వాసన వస్తుంది. అలాంటి సమయంలో గ్రీన్ టీ బ్యాగులను ఎండబెట్టుకుని అందులో ఉంచుకోవాలి. అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి వచ్చే దుర్వాసనను ఇది అరికట్టి మంచి స్మెల్ వచ్చేలా చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది నాన్-స్టిక్ పాన్‌ను ఉపయోగిస్తారు. ఇందులో కొందరు నూనెతో వంటలు చేసినప్పుడు ఆ నూనె పెనానికి పట్టుకుని అలాగే ఉంటుంది. అప్పుడు గ్రీన్ టీ దినుసులను ఉపయోగించి ఆ నూనెను పోగొట్టుకోవచ్చు. ఇలా గ్రీన్ టీ బ్యాగులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రయోగాలు స్టార్ట్ చేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది