
Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు... దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...!
Apple Cider Vinegar : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు Weight Loss సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ సమస్య నుండి బయట పడలేకపోతున్నారు. అలాంటివారికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే దీనిని ప్రతిరోజు నీటిలో కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాక ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే గోరు వెచ్చటి నీటిలో ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోవడం వలన 5 రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో యాపిల్ వెనిగర్ కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ యాపిల్ వెనిగర్ లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుండి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.
తాజాగా రీసెర్చ్ గేట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని వెళ్లడైంది. అయితే దీనిలో ఉండే ఆంటీ గ్లైసిమిక్ ఎఫెక్ట్ మరియు యాంటీ డయాబెటిక్ Diabetes లక్షణాలు దీనికి కారణమని నిపుణులు తెలియజేశారు.
ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇది అజీర్తి గ్యాస్ Gas Problem వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు… దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…!
యాపిల్ సైడర్ వెనిగర్ చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
యాపిల్ వెనిగర్ ప్రతిరోజూ తీసుకోవడం వలన బరువు తగ్గడం సులభతరం అవుతుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం..2009లో 175 మంది పై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం…3 వారాలపాటు 1-2 టీ స్పూన్ల వెనిగర్ తీసుకున్న వ్యక్తులలో 2-4 పౌండ్స్ బరువు తగ్గినట్లుగా వెళ్లడైంది.
ఈ యాపిల్ వెనిగర్ ను 1 లేదా 2 స్పూన్స్ గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజు Morning ఉదయం ఖాళీ కడుపుతో empty stomach తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ చిట్కాలను పాటించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.