Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు… దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు… దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…!

Apple Cider Vinegar  : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు Weight Loss  సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ సమస్య నుండి బయట పడలేకపోతున్నారు. అలాంటివారికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే దీనిని ప్రతిరోజు నీటిలో కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు అనేక తీవ్రమైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు...దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...!

Apple Cider Vinegar  : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు Weight Loss  సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్య నుండి బయటపడడానికి అనేక విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ సమస్య నుండి బయట పడలేకపోతున్నారు. అలాంటివారికి యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు బరువు తగ్గించేందుకు సహాయపడుతుంది. అయితే దీనిని ప్రతిరోజు నీటిలో కలిపి తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు అనేక తీవ్రమైన వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. అంతేకాక ఆరోగ్యానికి కూడా ఇది చాలా మేలు చేస్తుందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే గోరు వెచ్చటి నీటిలో ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తీసుకోవడం వలన 5 రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Apple Cider Vinegar : రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో యాపిల్ వెనిగర్ కలిపి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ యాపిల్ వెనిగర్ లో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ప్రమాదకరమైన బ్యాక్టీరియా నుండి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

Apple Cider Vinegar : చక్కెర నియంత్రణ

తాజాగా రీసెర్చ్ గేట్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుందని వెళ్లడైంది. అయితే దీనిలో ఉండే ఆంటీ గ్లైసిమిక్ ఎఫెక్ట్ మరియు యాంటీ డయాబెటిక్ Diabetes లక్షణాలు దీనికి కారణమని నిపుణులు తెలియజేశారు.

Apple Cider Vinegar : జీర్ణ క్రియ

ప్రతిరోజు యాపిల్ సైడర్ వెనిగర్ ను గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వలన జీర్ణక్రియ సులభం అవుతుంది. ఇది అజీర్తి గ్యాస్ Gas Problem  వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Apple Cider Vinegar యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో

Apple Cider Vinegar : యాపిల్ సైడర్ వెనిగర్ లో బోలెడు ఔషధ గుణాలు… దీనితో కలిపి తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో…!

Apple Cider Vinegar : కొలెస్ట్రాల్

యాపిల్ సైడర్ వెనిగర్ చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాలను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

Apple Cider Vinegar : బరువు తగ్గడానికి

యాపిల్ వెనిగర్ ప్రతిరోజూ తీసుకోవడం వలన బరువు తగ్గడం సులభతరం అవుతుంది. హార్వర్డ్ హెల్త్ ప్రకారం..2009లో 175 మంది పై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం…3 వారాలపాటు 1-2 టీ స్పూన్ల వెనిగర్ తీసుకున్న వ్యక్తులలో 2-4 పౌండ్స్ బరువు తగ్గినట్లుగా వెళ్లడైంది.

Apple Cider Vinegar : ఏ సమయంలో తీసుకుంటే మంచిది

ఈ యాపిల్ వెనిగర్ ను 1 లేదా 2 స్పూన్స్ గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతిరోజు Morning  ఉదయం ఖాళీ కడుపుతో empty stomach  తీసుకోవడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ చిట్కాలను పాటించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది