Empty Stomach : ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే రిస్క్‌లో పడ్డట్టే..!
Empty Stomach : పండ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయని మన అందరికి తెలిసిన విషయమే. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు తింటే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు కూడా చెబుతుంటారు. అయితే పండ్లని కొందరు డైరెక్ట్‌గా తినలేని వారు జ్యూస్‌గా చేసుకొని తాగుతూ సంతృప్తి చెందుతారు.అలా తాగితే శరీరానికి మంచి ఎనర్జీ రావడమే కూడా బూస్టర్‌గా కూడా పని చేస్తుంది. అయితే ఏది మన ఆరోగ్యానికి మంచి చేసిన కూడా సమయం ప్రకారం తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.
పరగడుపున తీసుకునే ఆహారం లేదంటే పానీయం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.. పర గడుపున జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు రావడం జరుగుతుందట. డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ మధ్య సమయం ఎక్కువగా ఉండడంతో మన కడుపు ఖాళీగా ఉంటుంది. అప్పుడు పుల్లని పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను అస్సలు తీసుకోకూడదు. ఆరెంజ్, సీజనల్ పండ్లు, నిమ్మకాయ వంటి వాటితో తయారు చేసిన జ్యూస్ పరగడుపు తీసుకోకూడదు. ఇక పండ్లలో ఫైబర్ ఉంటుంది కాని రసంలో ఫైబర్ ఉండదు. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించకపోవడంతో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
Empty Stomach : ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే రిస్క్‌లో పడ్డట్టే..!
పండ్ల రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది కాబట్టి చక్కెర స్థాయి ఆకస్మాత్తుగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మీ దంతాలకు నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది.పండ్ల రసంలో ఉండే ఆమ్లత్వం దంతాలపై ఉండే ఎనామిల్‌ని దెబ్బ తీస్తుంది. వాటి వలన దంతాలలో కుహరం, సున్నితత్వం కూడా సంభవించవచ్చు. పండ్లు తింటే అందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యలని తొలగిస్తుంది. పండ్ల రసంలో ఫైబర్ ఉండదు కాబట్టి జీర్ణక్రియ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట జ్యూస్ అస్సలు తాగకూడదు. ఒకవేళ.. పొరపాటున ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే.. ఆ తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి
ADA Recruitment 2025 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఏరోనాటికల్…
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్…
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…
Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…
Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…
Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…
This website uses cookies.