Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త... అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!
Farmers : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరుగుతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికలు నాలుగో దశలో భాగంగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఖాతాలో పడాల్సిన డబ్బులు ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అధికారులు ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ఆ పథకానికి లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా లభించడంతో త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నట్లుగా సమాచారం. అవి కూడా ఎకరానికి రూ.10,000 ఇవ్వడం విశేషం. ఇంతకీ రైతన్నలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు.. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైతన్నల కష్టం గురించి మాటల్లో చెప్పడం కష్టమైన పని. ఎందుకంటే రైతన్నలను ప్రభుత్వాలతో పాటు ప్రకృతి కూడా మోసం చేస్తూ వారితో ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి వర్షాలు లేకుండా ప్రకృతి ఇబ్బంది పెడితే మరోసారి అతివృష్టి , వరదలతో పంటను నాశనం చేస్తుంది. ఇలాంటి తరుణంలోనే ప్రభుత్వాలు రైతన్నలకు అండగా నిలబడతామని ముందుకు వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నెల వడగల్లు మరియు అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన దీనికి ఈసీ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈసీ మద్దతు కూడా లభించడంతో వ్యవసాయ శాఖ వర్గాలు పంట నష్టపోయినటువంటి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది . అయితే మార్చి నెలలో పడినటువంటి అకాల వర్షాలకు దాదాపు 15,814 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించిన సంగతి మనందరికీ తెలిసిందే.
Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త… అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!
దాదాపు 10 జిల్లాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇక ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతు సోదరులకు ఆర్థిక సాయం చేసేందుకు…వారందరికీ ఎకరాకు 10వేలు చొప్పున మొత్తం 15.81 కోట్ల పరిహారం అందజేయాలని నిర్ణయించుకుంది. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హాయంలో ఒకసారి ఇలాగే తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ఎకరాకు 10వేలు చొప్పున రైతన్నలకు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతన్నలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.