Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?
ప్రధానాంశాలు:
Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు... కారణం ఏమిటి తెలుసా...?
Early Puberty : ప్రస్తుత కాలంలో చూస్తే పిల్లలు చిన్న వయసులోనే పెద్దవారిగా కనిపిస్తున్నారు.ఇలా జరిగేసరికి చాలామంది తల్లిదండ్రులు కంగారు పడుతుంటారు. జరుగుటకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు,జీవనశైలి అలాగే రసాయనాల ప్రభావం వంటి వాటి వల్ల కూడా ఇది సంభవిస్తుందంటున్నారు. ఆరోగ్య నిపుణులు. కాకా ముందస్తు యవ్వనం పిల్లల శారీరక మానసిక ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతుంది అందుకే తల్లిదండ్రులు, ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. పిల్లలను చూస్తే చిన్న వయసు, కానీ వారు మాత్రం యవ్వనంగాను చాలా పెద్ద వారిలాగా కనిపిస్తూ ఉంటారు. ఆడపిల్లలైతే త్వరగా మెచ్యూర్ కూడా అవుతున్నారు. వారికి 10 సంవత్సరాలు రావడంతోటే మెచ్యూర్ అవుతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది అని డాక్టర్ కారుణ్య తెలిపారు. కారణంగా ఆడపిల్లలకు ఎనిమిది సంవత్సరాల తర్వాత శరీరంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరి ఆడపిల్లల్లో ఈ మార్పులు అంతకంటే ముందే కనిపిస్తున్నాయి. దీనికి గల కారణం చాలా ఉండవచ్చు. ఈ సమస్య కేవలం ఆహారపు అలవాట్ల వలన సంభవించడం మాత్రమే కాదు అని డాక్టర్ చెబుతున్నారు.ఈ సమస్యలకు గల కారణాలు, తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరడానికి గల కారణాలు డాక్టర్ కారుణ్య తెలియజేస్తున్నారు. చాలామంది అనుకునేలా కేవలం పాలు, చికెను వంటి ఆహార పదార్థాలు మాత్రమే దీనికి కారణం కావు. దీని ప్రధాన కారణాలు మరొకటి ఉన్నాయి అంటున్నారు..

Early Puberty : ఈ రోజుల్లో పిల్లలు త్వరగా ఎదుగుతున్నారు… కారణం ఏమిటి తెలుసా…?
Early Puberty హార్మోన్ల అచ్చమతుల్యత
. శరీరంలో హార్మోన్ లో సరిగ్గా సమన్వయం కాకపోవడంతో ఈ సమస్య వస్తుంది. అంతేకాదు హార్మోన్ల పనితీరులో వచ్చే మార్పులు వల్ల పిల్లలు త్వరగా పెద్ద వారిలా, యవ్వనంగా కనిపిస్తున్నారు .
. ఆహారపు అలవాట్లు :
వయసులోనే పిల్లలు అధిక బరువు పెరగడం కూడా శరీరంలో కొవ్వు శాతం పెరగడం. ఇది కూడా హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పిల్లలు త్వరగా పెద్దవారిలా కనిపిస్తారు.
వంశపారంపర్యం : కుటుంబ చరిత్రలో ఎవరికైనా చిన్న వయసులోనే యవ్వన లక్షణాలు కనిపించి ఉంటే, పిల్లలకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
ఆహారపు అలవాట్లు : జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకుంటే ఈ సమస్య తలెత్తుతుంది కావున ఇలాంటి ఆహారం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి హార్మోన్ల సమతుల్యతలు దెబ్బతింటాయి.
అధిక బరువు: చిన్న వయసులోనే పిల్లలు స్థూలకాయత్వానికి గురవుతున్నారు శరీరంలో అధిక కొవ్వు శాతం పెరిగి హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది దీనివల్ల వీరు యవ్వన దశకు త్వరగా చేరుకుంటున్నారు.
రసాయనాల ప్రభావం : కొన్ని రకాల కాస్మెటిక్స్,సబ్బులు, డిటర్జెంట్లలు ఉండే పారా బెన్స్ ట్రైక్లోసాన్,ప్తాలెట్స్ వంటి రసాయనాల హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తుంది. ఏండోక్రైన్, డిస్త్రప్టర్స్ అని పిలుస్తారు. శరీరంలోకి చేరి సహజ హార్మోన్ల పనితీరును అడ్డుకోవడం వల్ల యవ్వనం త్వరగా ప్రారంభమవుతుంది.
Early Puberty ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
ఆరోగ్యకరమైన ఆహారం : పిల్లలకు వీలైనంతవరకూ ఇంట్లో వండిన తాజా పోషకాలతో కూడిన ఆహారం ఇస్తూ ఉండాలి.బయట దొరికే జంక్ ఫుడ్ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. సురక్షితమైన ఉత్పత్తుల ఎంపిక :
పిల్లల కోసం వాడే స్కిన్ కేర్ హెయిర్ కేర్ ఉత్పత్తులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పారబెన్స్, ప్తాలేట్స్ వంటి రసాయనాలు లేని సురక్షితమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి.
ఇంటి పరిశుభ్రత : ఇంటి శుభ్రత కోసం సాధ్యమైనంత వరకు సహజమైన పదార్థాలతో తయారు చేసిన డిటర్జెంట్లు క్లినిక్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తుండాలి.. రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల హార్మోన్ల పని తీరుపై ప్రభావం చూపుతుంది.
గమనించిన చిన్నపాటి మార్పులు చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండవచ్చని డాక్టర్ కారుణ్య తెలిపారు.చిన్న చిన్న మార్పులు చేయడం భవిష్యత్తులో వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యలను నిరోధిస్తాయి. మీ పిల్లల జీవనశైలి ఆహారపు అలవాట్లు వారు వాడి ఉత్పత్తుల విషయంలో శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం.