Banana Side Effects : ఆరోగ్యానికి మంచిదని అరటిపండ్లను తెగ లాగించేస్తున్నారా? ఎలాంటి నష్టాలను కలిగిస్తాయో తెలుసుకోండి
Banana Side Effects : అరటిపండు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ అరటిపండు తింటే ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. అయితే.. అరటిపండు మంచిది కదా అని ఎడాపెడా తినేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. నిజానికి అరటిపండులో చాలా సుగుణాలు ఉన్నాయి. అలా అని ఎక్కువ తింటే ప్రమాదమే. ఏదైనా మితంగా తినాలి. మితంగా తింటే అమృతం.. అమితంగా తింటే విషం అని మన పెద్దలే చెప్పారు కదా. అరటిపండులో ఫైబర్ ఉంటుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి.
పొటాషియం తక్కువగా ఉన్నవాళ్లు రోజూ ఒక అరటిపండును తింటుంటారు. అయితే.. ఎక్కువ అరటిపండ్లు అంటే రోజుకు రెండు మించి అరటిపండ్లు తింటే మాత్రం లేనిపోని సమస్యలకు కొనితెచ్చుకోవాల్సిందే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు రెండుకు మించి అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారట. దానికి కారణం.. ఒక అరటిపండులో ఉండే 100 కేలరీలు. ఒక అరటిపండు తింటే 100 కేలరీలు వస్తాయి. రెండు అరటిపండ్లు తింటే 200 కేలరీలు.. ఎక్కువ తీసుకుంటే.. శరీరంలో ఆ కేలరీలు అలాగే కొవ్వులుగా మారి బరువు పెరుగుతారు.
Banana Side Effects : రెండుకు మించి అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారు
అరటిపండులో పొటాషియం ఎక్కువ ఉంటుందని తెలుసు కదా. ఎక్కువ అరటిపండ్లు తింటే ఆ పొటాషియం ఎక్కువ అయి పల్స్ రేటు పెరుగుతుంది. హైపర్ కలేమియా లక్షణాలు కనిపిస్తాయి. గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఉంటే ఫ్రక్టోజ్ మధుమోహాన్ని కూడా పెంచుతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్లు అరటిపండ్లను ఎక్కువగా తీసుకోకూడదు. ఏదైనా మితంగా తింటేనే మంచిది. అందులో అరటిపండ్లు కూడా అంతే. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా అరటిపండ్లను ఎక్కువగా తీసుకోకూడదు.