Fake Chilli Powder : కారంపొడి వర్జినలా… నకిలీదా… అని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fake Chilli Powder : కారంపొడి వర్జినలా… నకిలీదా… అని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి…?

 Authored By ramu | The Telugu News | Updated on :24 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Fake Chilli Powder : కారంపొడి వర్జినలా... నకిలీదా... అని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి...?

Fake Chilli Powder : మనం నిత్యం కూడా వంటకాలలో కారం లేనిదే కూరలు వండడం. అయితే మార్కెట్లో ఎన్నో రకాల కారంపొడులు లభ్యమవుతున్నాయి. పాతకాలం నుంచి, ఇప్పటివరకు కూడా కొందరు ఎండు మిరపకాయలను తీసుకొని, ఎండలో రెండు రోజులు ఎండ పెట్టి, ఆ తరువాత కారం మిల్లులో ఆడించి కారం పొడిని తయారుచేస్తారు. ఇలా చేసిన కారప్పొడి ఒరిజినల్. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ రోజుల్లో కొంతమంది, రెడీమేడ్ కారం ని, అంటే మార్కెట్లో నుంచి కారంపొడి ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. పాతకాలంలో లాగా మిరపకాయలను ఎండబెట్టి పట్టించే అంత ఓపిక లేనివారు. రాకెట్ లో తేలిగ్గా దొరికే రెడీమేడ్ కారప్పొడి ప్యాకెట్లు నువ్వు వినియోగిస్తున్నారు. అయితే ఆ కారంపొడి ప్యాకెట్లు కొన్ని కల్తీ ఉంటున్నాయి. ఈ కల్తీ కారప్పొడి వాడడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కల్తీకారం చాలా ఆకర్షణీయమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కారం యొక్క ఘాటు కూడా సాధారణ కారం కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎక్కువగా మార్కెట్లనుంచి కారంపొడి ని కూడా ఎక్కువగానే కొని తెస్తారు. పరిధి కారప్పొడిని వంటల్లో వేసినప్పుడు రుచిగా మరియు ఘాటుగా కూడా ఉంటుంది. మార్కెట్లలో కొన్ని రకరకాల కారంపొడులు కూడా వేరువేరు పేర్లతో లభ్యం అవుతున్నాయి. కొంతమంది అధిక లాభాలు కోసం కారప్పొడులను కల్తీ చేసి అమ్ముతున్నారు. ఈ ప్రతిరోజు కూడా ఆహారాలలో వినియోగిస్తే రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మరి ఈ కారం ని మనం ఎలా గుర్తించాలి. ఈ కారపూడి అసలైనదా లేదా నకి లేదా అని మనం పరీక్షలు చేయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. వ్యా పరీక్షలు ఎలా చేయాలో తెలుసుకుందాం…

Fake Chilly Powder కారంపొడి వర్జినలా నకిలీదా అని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి

Fake Chilly Powder : కారంపొడి వర్జినలా… నకిలీదా… అని ఎలా టెస్ట్ చేసి తెలుసుకోవాలి…?

Fake Chilli Powder : కల్తీకారాన్ని గుర్తించడం ఎలా

మొదట, ఒక గ్లాస్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎర్ర కారం పొడిని కలపాలి. తరువాత కారంపొడిని ఆ గ్లాస్ నీటిలో చెంచాతో కదిపి, తర్వాత కొద్ది సేపటికి నీటిలోని గ్లాస్ అడుగుభాగం లోనికి కారప్పొడి ఆటోమేటిక్ గా నే వెళ్తుంది. అయితే నీటి అడుగుభాగానికి చేరిన ఆ కారంపొడిని మీ చేతిలోకి తీసుకొని తేలిగ్గా రుద్దాలి.. అది గరుకుగా ఉంటే, అందులో ఎర్రటి ఇటుక పొడి కలిపినట్లే…
నానబెట్టిన కారంపొడి చాలా మృదువుగా, ముట్టుకుంటే మెత్తగా అనిపిస్తుంది. కానీ గరుకుగా ఉండే దానికి మాత్రం సబ్బు పొడి కలిపి కల్తీ చేస్తారని అర్థం. ఈరోజు స్వచ్ఛమైన కారపొడిని గుర్తించడానికి దానిని నీటిలో కలిపి చెక్ చేయవచ్చు. నిజమైన కల్తీ లేని ఎర్ర మిరపకాయల పొడి నీటి పైన తేలుతుంది. కారంపొడి పైకి తేలకోకుండా నీటిలో మునిగిపోతే మాత్రం అది నకిలీ కారంపొడి అని అర్థం. ఇటుకపొడి బరువైనది కాబట్టే అది నీటిలో అడుగు బాగానే చేరుతుంది. నిజమైన కారప్పొడి తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది నీటి పైన తేలుతుంది. రెండిటి వ్యత్యాసం తోటి, అసలైన కారపొడిని మరియు నకిలీ కారపొడిని ఈజీగా గుర్తించవచ్చు.

అంతేకాకుండా కల్తీకారాన్ని గుర్తించడానికి మిరపపొడికి కొన్ని చుక్కల అయోడిన్ టీoక్చర్ లేదా అయోడిన్ ద్రావణాన్ని జోడించాలి. ఈ అయోడిన్ చుక్కలను కారంపొడి పై కలిపితే తరువాత కారప్పొడి నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. కూడా కారంపొడి నకిలీదా అసలైనదా అని తెలుసుకోవచ్చు. కారప్పొడిని గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కల్తీ కారపొడులు కాకుండా రెడీమేడ్ వాడకం తగ్గించి. ఇంట్లోనే మిరపకాయల కారప్పొడిని మిల్లును ఆడించి తయారు చేసుకుంటే మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది