Overweight : అధిక బ‌రువు తగ్గాలంటే పాటించాల్సిన ముఖ్య‌మైన సూచ‌న‌లు..!

Authored By Krishna B | The Telugu News | Updated on : 26 February 2021, 4:26 pm

Overweight : అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం అన్న‌ది ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మందికి స‌మ‌స్య‌గా మారింది. అందుకే చాలా మంది నిత్యం వ్యాయామం చేయ‌డం, జిమ్‌ల‌లో గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌డం, ఆహారాన్ని మితంగా తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గేందుకు ఇవే కాకుండా కింద తెలిపిన ప‌లు సూచ‌న‌ల‌ను కూడా పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Overweight : అన్ని పోష‌కాలు అందేలా

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని పోష‌కాలు అందేలా చూసుకోవాలి. కొన్ని సార్లు పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక నిత్యం త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం మాత్ర‌మే కాదు, అందులో అన్ని పోష‌కాలు ఉండేలా జాగ్ర‌త్త వ‌హించాలి. దీంతో అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

follow these important rules to reduce overweight

follow these important rules to reduce overweight

Overweight : పిండిప‌దార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు ముఖ్యం

నిత్యం మ‌నం తినే ఆహారంలో రెండు ర‌కాల ప‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఒక‌టి స్థూల పోష‌కాలు. రెండోది సూక్ష్మ పోష‌కాలు. పిండి ప‌దార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు స్థూల పోష‌కాల జాబితా కింద‌కు చెందుతాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ఇత‌ర పోష‌కాలు సూక్ష్మ పోష‌కాల జాబితా కింద‌కు వ‌స్తాయి. స్థూల పోష‌కాల‌ను నిత్యం ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ముఖ్యంగా మ‌నం తినే ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉండాలి. త‌రువాత పిండి ప‌దార్థాల‌ను తినాలి. కొద్ది మొత్తంలో కొవ్వు ప‌దార్థాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి అన్ని ర‌కాల ప‌దార్థాలు అందుతాయి. ఫ‌లితంగా మెట‌బాలిజం మెరుగు ప‌డి కొవ్వు క‌రిగేందుకు, అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఫైబ‌ర్ (పీచు ప‌దార్థం)

నిత్యం మ‌నం తినే ఆహారంలో ఫైబ‌ర్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఫైబ‌ర్ వ‌ల్ల ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. పైగా ఆహారం కూడా త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో శ‌రీరానికి అందే క్యాల‌రీల సంఖ్య త‌గ్గుతుంది. ఫ‌లితంగా అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు

ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలు, ప్యాక్ చేయ‌బ‌డిన ప‌దార్థాలు, చ‌క్కెర‌, కొవ్వులు, ఉప్పు ఎక్కువ‌గా ఉండే ప‌దార్థాలు, ఇత‌ర జంక్ ఫుడ్‌ల‌ను తిన‌డం మానేయాలి. ఇవి బ‌రువును త‌గ్గించ‌క‌పోగా అధిక బ‌రువును పెంచేందుకు తోడ్పడుతాయి. క‌నుక వీటిని పూర్తిగా మానేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది.

మ‌ద్య‌పానం, ధూమ‌పానం

మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డం వ‌ల్ల కూడా అధిక బ‌రువు పెరుగుతారు. క‌నుక వీటిని మానేస్తే అధిక బ‌రువు త‌గ్గుతారు.

Krishna B

No bio available for this author.

  1. "Karthika Deepam 2 Today Episode August 05 : సూరజ్‌ను దత్తత తీసుకుంటానన్న శ్రీధర్.. జ్యోత్స్నకు భారీ షాక్!"

  2. "Gold Rate Today : గుడ్‌న్యూస్‌.. నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి.. ఆగస్టు 5 తాజా గోల్డ్ రేట్లు ఇవే!"

  3. "Sprouted Green Gram : కోడిగుడ్లు, పాలకంటే ఎక్కువ ప్రొటీన్.. ఈ సూపర్ ఫుడ్ తెలుసా?.. రోజూ గుప్పెడు చాలు!"

  4. "Fennel Water : డయాబెటిస్ ఉన్నవారికి ఈ నీరు వరమా?.. రోజూ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!"

  5. "Tirumala : తిరుమలలో రూమ్ దొరకలేదా? అయితే నిరాశ చెందొద్దు.. టీటీడీ ఉచితంగా అందిస్తున్న ఈ సదుపాయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!"

  6. "Korean Kanakaraju Movie : ‘కొరియన్ కనకరాజు’పై పెరుగుతున్న అంచనాలు.. వరుణ్ తేజ్ కంబ్యాక్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అవుతుందా?"

  7. "Ys Jagan : జగన్ ఇంకా మోడీ దత్తపుత్రుడేనా? ..ఏపీ రాజకీయాల్లో మళ్లీ మొదలైన ఆసక్తికర చర్చ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp