
food that maintains ur good health after the age of 30 years
Heath Care Tips : మూప్ఫై ఏళ్లు పైబడిన వారి శరీరం క్రమంగా బలహీన పడుతుంది. శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కావున మన జీవన శైలికి అనువుగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇటీవల వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. శరీరంలో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటివి సరిపడా ఉండక పోతే నష్టమే అని అంటున్నారు. మంచి ఆరోగ్య వంతమైన జీవితం కోసం ఏ ఏ పదార్థాలను మన ఆహారంలో జోడించాలో ఇప్పుడు చూద్దాం.
ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి ఎంతో అవసరమవుతాయి. పాలు, పాలతో తయారైన పదార్ధాలు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి కానీ దాని వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి కంటే గుడ్డు, పాలే నయమని చెప్పవచ్చు.
food that maintains ur good health after the age of 30 years
ఇక 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పప్పులే ఎక్కువగా తినాల్సి ఉంటుంది. ఇది శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, బీన్స్ వంటి వాటిల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ప్రధానంగా శనగ పప్పు మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా కామెర్లు వ్యాధిని నయం చేయడంలోనూ సహాయపడుతుంది. పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.
30 ఏళ్ల అనంతరం శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎంతో అవసరం. కావున అవి ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు వంటి పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ అధికంగా అందుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.