Heath Care Tips : మీకు 30 ఏళ్లు దాటాయా.. మీ ఆహారంలో ఇవి తప్పక చేర్చుకోండి.. లేకపోతే అంతే ఇక..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heath Care Tips : మీకు 30 ఏళ్లు దాటాయా.. మీ ఆహారంలో ఇవి తప్పక చేర్చుకోండి.. లేకపోతే అంతే ఇక..!

 Authored By kranthi | The Telugu News | Updated on :26 December 2021,7:15 am

Heath Care Tips : మూప్ఫై ఏళ్లు పైబడిన వారి శరీరం క్రమంగా బలహీన పడుతుంది. శరీరంలో అనేక మార్పులు వస్తాయి. కావున మన జీవన శైలికి అనువుగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇటీవల  వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. శరీరంలో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటివి సరిపడా ఉండక పోతే నష్టమే అని అంటున్నారు. మంచి ఆరోగ్య వంతమైన జీవితం కోసం ఏ ఏ పదార్థాలను మన ఆహారంలో జోడించాలో ఇప్పుడు చూద్దాం.

Heath Care Tips : గుడ్డు, ఆవు పాలు

ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి ఎంతో అవసరమవుతాయి. పాలు, పాలతో తయారైన పదార్ధాలు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి కానీ దాని వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి కంటే గుడ్డు, పాలే నయమని చెప్పవచ్చు.

food that maintains ur good health after the age of 30 years

food that maintains ur good health after the age of 30 years

Heath Care Tips : పప్పులు

ఇక 30 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పప్పులే ఎక్కువగా తినాల్సి ఉంటుంది. ఇది శరీరంలో ప్రోటీన్ లోపాన్ని తీర్చడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. పప్పులు, బీన్స్‌ వంటి వాటిల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ప్రధానంగా శనగ పప్పు మధుమేహాన్ని నియంత్రించడమే కాకుండా కామెర్లు వ్యాధిని నయం చేయడంలోనూ సహాయపడుతుంది. పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

Heath Care Tips : పీచు పదార్థాలు

30 ఏళ్ల అనంతరం శరీరానికి కార్బోహైడ్రేట్స్‌ ఎంతో అవసరం. కావున అవి ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు వంటి పీచు పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ అధికంగా అందుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుపచ్చని ఆకుకూరలు, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది