Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు...?
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు మరియు జలుబు, జ్వరం లాంటి అంటు వ్యాధులు విపరీతంగా వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండేందుకు వేడివేడిగా అల్లం టీ తాగితే మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ అల్లం టీ అనేది యాంటీ యాక్సిడెంట్లతో నిండి ఉంటుంది. దీంట్లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. దీంతో రోగ నిరోధక శక్తి అనేది బలంగా తయారవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల ప్రమాదాలను కూడా నియంత్రిస్తుంది. తరచుగా అల్లం టీ ని తీసుకుంటే జలుబు మరియు దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు త్వరగా తగ్గిపోతాయి.
Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?
తరచుగా అల్లం టీ ని తాగితే జీర్ణక్రియ కూడా ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే ఈ అల్లం టీ అనేది జీర్ణ ఎంజెమ్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. అలాగే ఈ అల్లం లోని సమ్మేళనాలు జీర్ణ క్రియను ప్రేరేపించి వికారం మరియు అజీర్ణం, ఉబ్బరం లాంటి సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ అల్లం లో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉంటాయి. అందుకే చలికాలంలో అల్లం టీ ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో ఇన్ ఫ్లమేషన్ మరియు మంట, వాపును కూడా నియంత్రిస్తుంది. అలాగే అల్లం అనేది అర్థరైటిస్ మరియు కండరాల నొప్పి లాంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఇది గుండె సమస్యలు మరియు క్యాన్సర్, డయాబెటిస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది…
తరచుగా అల్లం టీ ని తాగడం వలన బరువు కూడా అదుపులో ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఈ అల్లంలో ఉండే సమ్మేళనాలు అనేవి జవక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఆకలిని కూడా అదుపులో ఉంచుతుంది. దీనివలన ఆహారాన్ని అతిగా తీసుకోకుండా ఉంటారు. అలాగే బరువు తగ్గాలి అని అనుకునేవారు మరియు వెయిట్ కంట్రోల్ లో ఉంచుకోవాలి అని అనుకునేవారు అల్లం టీని తప్పనిసరిగా తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ఈ అల్లం టీ అనేది డయాబెటిస్ వారికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అల్లం టీ ని తీసుకోవడం వలన ఇన్సూలిన్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. అంతేకాక హిమోగ్లోబిన్ a1సి మరియు ట్రై గ్లిజరైడ్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే అల్లం టీ అనేది డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా తగ్గిస్తుంది
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.