
Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు...!
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే వాస్తు నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంట్లో వస్తువు సరైన దిశలో ఉంచినట్లయితే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి వస్తువును సరైన ప్రదేశంలో ఉంటే ఆ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీనివల్ల ఇంట్లో సుఖసంతోషాలు సంపదలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రదేశాలలో శక్తి అసమతుల్యత కారణంగా వాస్తు లోపాలు ఉండవచ్చు. వీటి కారణంగా ఇంట్లో శాంతి శ్రేయస్సు ఆనందం ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోవడం కోసం ఎలాంటి చర్యలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!
– ఇంటి ప్రధాన ద్వారం తలుపులు ఉత్తరం , తూర్పు లేదా ఈశాన్య దిశలో మాత్రమే ఉంచండి. దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
– వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. ఇక వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపుగా ఉండేలా చూసుకోవాలి.
– పడకగది మాత్రం నైరుతి దిశలో ఉంచగా తల దక్షిణం వైపు పాదాలు ఉత్తరం వైపు ఉంచాలి.
– ఇంట్లో పూజ గది ఈశాన్య దిశలో ఉండాలి. పూజలు చేసేటప్పుడు ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచండి.
– బాత్రూం దక్షిణ లేదా పడమర దిక్కు అనువైనదిగా పరిగణించబడుతుంది.
– ఇంట్లోని డ్రాయింగ్ రూమ్ ఎప్పుడు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. అలాగే అందులోని ఫర్నిచర్ దక్షిణం లేదా పడమర వైపు ఉంచండి.
– స్టోర్ రూమ్ లో ధాన్యాలు బరువైన వస్తువులను ఎప్పుడు నైరుతి దిశలో ఉండాలి.
– ఇంటి మెట్లు చాలా ముఖ్యమైనవి కాబట్టి అవి దక్షిణం లేదా పడమర దిశలో ఉండాలి.
– వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాటర్ ట్యాంక్ ఈశాన్య దిశలో ఉండడం సరైనది.
* ఇంట్లోనే అద్దం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచాలి.
* ఇంట్లో డబ్బులు ఆభరణాలు పెట్టుకునే లాకర్ దక్షిణ దిశలో ఉండడం సరైన భావిస్తారు. ఇక లాకర్ తలుపులు తెరిచినప్పుడు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.
– వాస్తు దోషాలు ఉన్నవారు ఇంట్లో పిరమిడ్ ను ఉంచండి. ఇది సానుకూల శక్తిని పెంచుతుంది.
– ఇంట్లో నెమలి ఈకను దోషపూరిత ప్రదేశాలలో ఉంచండి. దీని వలన ప్రతికూలను శక్తి తగ్గుతుంది.
– ఇంట్లో వారానికి ఒక్కసారైనా లవంగం కర్పూరాన్ని కాల్చండి. వీటి సువాసన ఇంటి మొత్తానికి వ్యాపింపజేయండి. ఇలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది.
– ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈశాన్యం మూలను శుభ్రంగా ఉంచి అక్కడ ఎక్కువ కాంతి పడేలా చూసుకోవాలి.
– తులసి మొక్కను ఇంట్లో ఈశాన్య దిశలో నాటండి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచడానికి సహాయపడుతుంది.
– ముఖ్యంగా ఇంట్లో మనీ ప్లాంట్ ని పెట్టుకోవాలి. దీని వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
– వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకోవడం వలన సంతోషం శాంతి శ్రేయస్సుని పొందవచ్చు.
– ఇంటి ప్రధాన ద్వారం లేదా పూజ స్థలంలో వాస్తు యంత్రాన్ని పెట్టండి.
– శ్రీ యంత్రం లక్ష్మీదేవికి ప్రతీక కాబట్టి దీనిని ఉత్తర దిశలో పెట్టడం వలన ఇంట్లో సంపద పెరుగుతుంది.
– ప్రతి పౌర్ణమి రోజున ఇంట్లో గంగాజలంతో శుద్ధి చేసి ధూపం లేదా అగర్బత్తిలను వెలిగించండి.
– ఇంట్లో అనవసరమైన వస్తువులను మరియు పగిలిన గాజులను లేదా మరేదైనా నాసిరక వస్తువులను ఉంచకూడదు. ఇలాంటివి ఉంటే వెంటనే బయట పెట్టండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.