Hair Care Tips : కాకరకాయతో కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా… ఎలాగంటే…??
ప్రధానాంశాలు:
Hair Care Tips : కాకరకాయతో కూడా జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చు తెలుసా... ఎలాగంటే...??
Hair Care Tips : కాకరకాయ అంటే చాలు చాలా మంది ముఖం తిప్పుకుంటారు. ఎందుకంటే ఇది చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి దీనిని తినటానికి ఎవరు ఇష్టపడరు. అయితే వీటిలో మాత్రం యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కాకరకాయ అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనికోసం తాజాగా ఉన్న మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న కాకరకాయను తీసుకోవాలి. అయితే ఈ కాకరకాయను శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వీటిలో ఉండే విత్తనాలను కూడా తీసేయాలి. ఆ తర్వాత ఈ ముక్కలన్నింటిని మిక్సీ జార్లో వేసి దానిలో కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టండి. ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ ను జల్లెడ సహాయంతో రసాన్ని తీయండి. ఇప్పుడు ఈ రసాన్ని తలకు అప్లై చేసుకుని స్మూత్ గా మర్దన చేసుకుని ఒక 30 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా మీరు వారానికి రెండు లేక మూడు సార్లు తలకు పెట్టుకుంటే, తొందరలోనే మంచి మార్పు మీకు కనిపిస్తుంది…
అలాగే కాకరకాయతో నూనెను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని కోసం కొబ్బరి నూనె లేక ఆలివ్ నూనెలో కాకరకాయ ముక్కలను వేసి కొద్ది రోజులపాటు నిల్వ ఉంచుకోవాలి. కొద్దిరోజుల తర్వాత ఆ నూనెలో ఉన్న ముక్కలను పిండి తీసివేయాలి. దానిలో ఉన్న నూనెను జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఈ నూనె అనేది జుట్టుకు ఎంతో ప్రభావితం గా పనిచేస్తుంది. అయితే ఈ కాకరకాయలో యాంటీబయక్రో బయల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది తలపై ఉన్నటువంటి ఆక్సీకరణ ఒత్తిడి ని కూడా నియంత్రిస్తుంది…
దీంతో జుట్టు రాలడం అనేది వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఇది తలపై ఉన్నటువంటి మడను కూడా హైడ్రోడ్ గా ఉంచుతుంది. అయితే ఈ కాకరకాయలో ఉండే విటమిన్లు జుట్టును అందంగా మరియు పొడవుగా పెరిగేలా చేస్తుంది. అలాగే ఈ కాకరకాయ రసం అనేది మీ జుట్టుకు ఎంతో సహజమైన కండిషనర్ గా కూడా పని చేస్తుంది. అలాగే మీ జుట్టు చిట్లిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది